Bihar Earthquake: బాబోయ్ భూకంపం.. ఢిల్లీతో పాటు బీహార్‌లో కూడా: ఇళ్లలోంచి పరుగే పరుగు!

దేశ రాజధాని ఢిల్లీతో పాటు బీహార్ రాష్ట్రంలోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 4.0 తీవ్రతతో బీహార్ లోని శివాన్‌లో భూకంపం సంభవించింది. దీని కారణంగా పలు ప్రాంతాల్లోని అనేక ఎత్తైన భవనాల నివాసితులు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. 

New Update
Bihar Siwan Earthquake

Bihar Siwan Earthquake

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ (సోమవారం) స్వల్ప భూప్రంకపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైన సంగతి తెలిసిందే. అయితే దీని తర్వాత మరో రాష్ట్రంలో భూకంపం సంభవించింది. ఢిల్లీ తర్వాత బీహార్ రాష్ట్రంలోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున 4.0 తీవ్రతతో బీహార్ లోని శివాన్‌లో భూకంపం సంభవించింది. దీని కారణంగా పలు ప్రాంతాల్లోని అనేక ఎత్తైన భవనాల నివాసితులు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. 

Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!

ఢిల్లీలో భూకంపం

దేశ రాజధాని ఢిల్లీలో 2025 ఫిబ్రవరి 17వ తేదీన స్వల్ప భూప్రంకపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఎక్స్ వేదికగా  తెలిపింది. ప్రకంపనలు ఉదయం 5:36 గంటలకు సంభవించాయని వెల్లడించింది.

అంతేకాకుండా ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా బలమైన భూ ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొంది. భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమేనని స్పష్టం చేసింది. కొన్ని సెకన్ల పాటు మాత్రమే  భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన జనం ఇళ్లలోంచి  బయటకు పరుగులు తీశారు.  అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. 

Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా 

Also Read :  Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు