Pakistan Floods: పాకిస్తాన్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 365కు పెరిగిన మృతుల సంఖ్య!

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తంఖ్వా రాష్ట్రంలో ఆకస్మికంగా కురిసిన కుండపోత వర్షాలకు ఇప్పటి వరకు 365 మంది మృతి చెందారు. కేవలం బునేర్ జిల్లాలో దాదాపుగా 225 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడి వంతెనలు, రోడ్లు కూలిపోయాయి.

New Update
Pakistan Floods

Pakistan Floods

పాకిస్తాన్‌లో వరదలు(Pakistan Floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఖైబర్ పఖ్తంఖ్వా రాష్ట్రంలో ఆకస్మికంగా కుండపోత వర్షాలు కురవడంతో ప్రాణ నష్టం తీవ్రంగా జరిగింది. ఈ వరదల వల్ల ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 365కు పెరిగింది. బునేర్ జిల్లాలో దాదాపుగా 225 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడి వంతెనలు, రోడ్లు కూలిపోయాయి. దీంతో రవాణా ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఇది కూడా చూడండి:  తైవాన్‌లోకి చైనా ఆర్మీ విమానాలు.. మరో యుద్ధం రాబోతుందా..?

1000 మందికి పైగా గల్లంతు..

భారీ వర్షాల(Heavy Rains) కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్నవారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరదల వల్ల పలు చోట్లు గ్రామాలు కూడా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఆకస్మిక వరదల వల్ల పాకిస్తాన్‌లో దాదాపు 1000 మందికి పైగా గల్లంతు అయినట్లు అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్‌లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జూన్ నెల నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 657 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఇందులో 929 మంది గాయపడినట్లు పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) తెలిపింది. 

ఇది కూడా చూడండి: UNOలో పాక్ ఆర్మీ నేర చరిత్ర.. ‘వేలాది మహిళలపై అఘాయిత్యాలు’

Advertisment
తాజా కథనాలు