Trump: నిన్నటి వరకు నోబెల్ ప్రైజ్...ఈరోజు ఏకంగా స్వర్గానికే టెండర్..ట్రంప్ లో ఆసక్తికర కోణం

ఆ డీల్ పూర్తయితే తాను స్వర్గానికి వెళతాను అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. నోబెల్ శాంతి బహుమతి కోసమే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపడానికి ట్రై చేస్తున్నాని నిన్నటి వరకు చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా స్వర్గం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. 

New Update
Donald Trump

Donald Trump

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ప్రపంచమంతా చూస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల తో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. దీని తరువాత త్రై పాక్షిక సమావేశానికి కూడా సిద్ధం అవుతున్నారు. అయితే నిన్నటి వరకు ఇవన్నీ నోబెల్‌ శాంతి బహుమతి ని గెలుచుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవి చేస్తున్నానని టరంప్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే తాను ఆరు యుద్ధాలను ఆపానని.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆగితే ఏడవది అవుతుందని అన్నారు. అప్పుడు తనకు కచ్చితంగా శాంతి బహుమతి వస్తుందని ఆయన భావిస్తున్నారు. అందుకే భారత్, పాకిస్తాన్ యుద్ధంలో ట్రంప్ ప్రమేయం ఎంత లేదని ఇండియా చెబుతున్నా...ఆయన మాత్రం ఆ క్రెడిట్ ను తన ఖాతాలోనే వేసేసుకున్నారు. 

ఇప్పుడు ఏకంగా స్వర్గానికే టెండర్..

ఇప్పటి వరకు నోబెల్ పాట పాడిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా స్వర్గానికే టెండర్ వేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగితే తాను స్వర్గానికి వెళతాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ఆ రెండు దేశాల మధ్యనా సయోధ్యకు సంబంధించి ప్రయత్నాలు కేవలం జీవితానికి సబంధించినవి కావని చెబుతున్నారు. తాను బాగా పని చేయడం లేదనే విమర్శను ఎదుర్కుంటున్నానని ట్రంప్ తెలిపారు. ఇప్పుడు యుద్ధం ఆగితే...ఒకవేళ నేను స్వర్గానికి వెళ్తే అందుకు దోహదం చేసే అంశాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుందని ఓ ఇంటర్వ్యలో చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ కూడా స్పందించారు. స్వర్గం వ్యాఖ్యలపై ట్రంప్ సీరియస్ గానే ఉన్నారని చెప్పారు. స్వర్గానికి వెళ్ళాలని అధ్యక్షుడు కోరుకుంటున్నారని...తామంతా కూడా అదే కోరుకుంటామని చెప్పారు.

ట్రంప్ లో పెరిగిన దైవభక్తి.. 

నిజం చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ జీవితం ఒక వివాదాల పుట్ట. వ్యాపారస్థుడిగా ఉన్నప్పటికి నుంచీ ఆయనపై చాలా అభియోగాలున్నాయి. చాలా కోర్టు కేసులను కూడా ట్రంప్ ఎదుర్కొన్నారు. నిన్నటి మొన్నటి వరకూ కూడా కోర్టు మెట్లు ఎక్కి దిగుతూ వచ్చారు. మొదటి సారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు కూడా ట్రంప్ చాలా వివాదాలను ఎదుర్కొన్నారు. ఇక ఈసారి ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. అప్పటి నుంచి ఆయనలో మార్పు వచ్చిందని చెబుతున్నారు. దైవభక్తి పెరిగిందని అంటున్నారు.  అందుకే ప్రతీసారి అమెరికాను మళ్ళీ గొప్పగా నిలబెట్టేందుకు ఆ భగవంతుడే నన్ను కాపాడాలి అంటున్నారని వివరిస్్తున్ారు. దీంతో పాటూ వైట్‌హౌస్‌లోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కూడా పెరిగినట్లు తెలుస్తోంది. దీని కోసం ఓ ఆధ్యాత్మిక గురువును సలహాదారుగా కూడా నియమించుకున్నారని సమాచారం.

Also Read: Breaking: ఢిల్లీలో మళ్ళా బాంబు కలకలం.. 50 స్కూళ్ళకు పైగా బెదిరింపులు..

Advertisment
తాజా కథనాలు