/rtv/media/media_files/2025/06/10/WEiBLwoprMAyNZwsq0F9.jpg)
Army Jawan attempts Suicide as unable to bear wife torture
భార్య వేధింపులు భరించలేక ఓ ఆర్మీ జవాన్ ఆదివారం రాత్రి సూసైడ్ చేసుకునేందుకు యత్నించడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన అరికిల్ల ప్రవీణ్ సికింద్రాబాద్ తిరుమలగిరిలోని టెరిటోరియల్ ఆర్మీ 125 బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకి పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన రజనికతో 2020లో పెళ్లి జరిగింది.
Also Read: ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం - వీడియో
Army Jawan Attempts Suicide
అయితే గతకొంతకాలంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి. భర్యతో పాటు అత్తింటివారు కూడా ప్రవీణ్‌ను ఇబ్బందులు పెడుతున్నారు. ప్రవీణ్ ఉద్యోగానికి వెళ్లకుండా ఐడీకార్డు దాచిపెడుతూ టార్చర్ పెట్టారు. రెండు నెలల క్రితం ప్రవీణ్ విధులకు వెళ్లాగ.. తన భార్య కూడా బెటాలియన్ వద్దకు వచ్చింది. ఇక్కడ వీళ్లిద్దరి మధ్య గొడవ జరగింది. తన పరువు పోయిందని భావించిన ప్రవీణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇక సెలవుల నిమిత్తం జూన్ 6న ప్రవీణ్ ఇంటికొచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడాడు.
Also Read: భర్తను లేపేయడానికి రూ.20 లక్షల డీల్.. హనీమూన్ కేసులో సంచలన నిజాలు!
ఆ తర్వాత హనుమకొండకు వెళ్లాడు. జూన్ 8న అక్కడే గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే తన అన్న ప్రసాద్‌కు ఫోన్ చేసి చెప్పగా.. అతడు ప్రవీణ్‌ను మిలటరీ ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సూసైడ్ యత్నానికి ముందు ప్రవీణ్ సూసైడ్ నోట్ కూడా రాశాడు. అందులో ''ప్రియమైన స్నేహితులారా.. నేను చనిపోతున్నా, నా చావుకి కారణమెవరో వాళ్లకి తెలుసు. వాళ్ల టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. అన్నయ్య అమ్మను బాగా చూసుకో. మన గ్రామంలోని వాలీబాల్ టీమ్ బతకాలి.. ఎప్పుడూ గేమ్‌ను వదలకండి అని'' ప్రవీణ్ సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చాడు.
Also Read: ప్రధాని మోదీకి మల్లిఖార్జున్ ఖర్గే సంచలన లేఖ.. ఎందుకంటే..?
Also Read : ట్రంప్ తప్పు చేశాడా.. అధికారాన్ని దుర్వినియోగం చేశాడా.. అమెరికా చట్టాలు ఏం చెబుతున్నాయి?
telugu-news | rtv-news | army-jawan | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news