PM Modi On Trump Tariffs: ప్రపంచ మార్కెట్ లో ఆధిపత్యం మనదే అవ్వాలి..టారీఫ్ ల నేపథ్యంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు

అదనపు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పోరాం చేస్తోంది భారత్. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ప్రపంచ మార్కెట్ ను పాలించాలి అంటూ పిలుపునిచ్చారు. 

New Update
modi-trump tariffs

PM Modi On Trump Tariffs

ఎర్రకోట(Red Fort) పై జాతీయ జెండాను ఆవిష్కరించిన భారత ప్రధాని మోదీ(PM Modi) అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అదనపు సుంకాల(trump tariffs)పై కీలక వ్యాఖ్యలు చేశారు. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. భారతదేశం చరిత్ర లిఖించాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. మనం ప్రపంచ మార్కెట్ ను పాలించాలి. తక్కువ ధర, అధిక నాణ్యతతో వస్తువులను ఉత్పత్తి చేయాలి. దాని ద్వారా ఆర్థిక సామర్థ్యం  పెంచుకోవాలని మోదీ అన్నారు. మనల్ని ఎవరూ తక్కువ చేసి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. దేశంలో వ్యాపారులు, వర్తకులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు.  భారతదేశం పురోగతిని సాధిస్తోందని...దీన్ని ప్రపంచం గమనిస్తోందని తెలిపారు. రైతు వ్యతిరేక విధానాలను సహించమని...దాని కోసం దేనికైనా వెనుకాడమని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. 

Also Read :  సీఎం యోగిని పొగిడి అడ్డంగా బుక్కయిన ఎస్పీ ఎమ్మెల్యే.. పార్టీ నుంచి సస్పెండ్

రైతుల విషయంలో తగ్గేదే లేదు..

ట్రంప్ టారీఫ్ లపై ప్రధాని మోదీ ఇంతకు ముందు కూడా స్పందించారు. రైతుల విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదని భారత ప్రధాని మోదీ అన్నారు. ట్రంప్ టారీఫ్ లకు తలొగ్గేదే లేదని తేల్చి చెప్పారు. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌లు పెంచడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.  రైతుల సంక్షేమం విషయంలో రాజీపడేదే లేదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు రష్యా నుంచి చమురు దిగుమతులును సాకు చూపిస్తున్నారు.. కానీ అసలు విషయం మాత్రం అది కాదని మోదీ అన్నారు. ఇంతకు ముందు వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా అమెరికా డెయిరీ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని ట్రంప్ వత్తిడి తీసుకు వచ్చారు. దానిని భారత్ నిరాకరించింది.  అలా చేస్తే దేశంలోని రైతులకు నష్టం చేకూరుతుందని తేల్చిచెప్పింది. ఈక్రమంలో వచ్చి విభేదాలతోనే ట్రంప్‌ భారత్‌పై టారిఫ్‌లు పెంచుతున్నట్లు తెలుస్తోందని మోదీ పరోక్షంగా చెప్పుకొచ్చారు.  

Also Read:  Trump-Putin Meet: ఈరోజే ట్రంప్, పుతిన్ భేటీ..విఫలం కావచ్చు అంటున్న అమెరికా అధ్యక్షుడు

Advertisment
తాజా కథనాలు