Pooja Pal: సీఎం యోగిని పొగిడి అడ్డంగా బుక్కయిన ఎస్పీ ఎమ్మెల్యే..పార్టీ నుంచి సస్పెండ్

ప్రతిపక్ష ఎమ్మెల్యే  అంటే అధికార పక్షం వాళ్ళని తిట్టాలి. అది సీఎం అయినా సరే. కానీ సమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్యే పూజాపాల్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను అసెంబ్లీ లో పొగిడారు. దీని ప్రతిఫలంగా ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. 

New Update
SP MLA Puja Pal

SP MLA Puja Pal

సమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్యే సూజా పాల్. ఈమె భర్త రాజ్ పాల్ హత్యకు గురయ్యారు. 2005లో గ్యాంగ్ స్టర్ అతిక్ మహ్మద్ అతనిని చంపేశాడు. అతిక్ అహ్మద్, ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రసిద్ధ గ్యాంగ్‌స్టర్. 100కు పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వీటిలో రాజ్ పాల్ హత్య కేసు కూడా ఒకటి. 2023లో యోగి ప్రభుత్వం ఓ ఆపరేషన్ చేపట్టింది. అందులో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్ కౌంటర్ లో అతిక్, అతని సోదరుడు అష్రఫ్ చనిపోయారు. 

మరోవైపు భర్త రాజ్ పాల్ చనిపోయాక పూజాపాల్ అత

Also Read :  ఎర్రకోటపై ప్రసంగించి రికార్డు సృష్టించిన మోదీ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఫొటోలు చూశారా?

సీఎం యోగిని పొగిడిన ప్రతిపక్ష ఎమ్మెల్యే..

ని స్థానంలో రాజకీయాల్లోకి వచ్చారు. ఈమె ప్రయాగ్‌రాజ్‌లోని చైల్ నియోజకవర్గం నుండి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం యూపీలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో పూజా యోగి ఆదిత్య నాథ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తన భర్త ను హత్య చేసిన గ్యాంగ్ స్టర్ అతిక్ మహ్మద్ ను చంపించి..తనకు న్యాయం అందేలా చేసినందుకు యూపీ సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ చర్య వల్ల ఉత్తరప్రదేశ్ లో అనేక మంది మహిళలకు న్యాయం జరిగిందని..ప్రయాగ్ రాజ్ మహిళల తరుఫున తాను మాట్లాడానని చెప్పారు. 

అయితే పూజాపాల్(Pooja Pal) మాటలు సొంత పార్టీ అయిన సమాజ్ వాదీ నేతలకు షాకిచ్చాయి. అసెంబ్లీలో అందరి ఎదురుగుండా బీజేపీ ముఖ్యమంత్రి ను పొగడ్డం వారికి మింగుడు పడలేదు. అంతేకాదు అది పార్టీ విధానానికి విరుద్ధమని భావించారు. దీంతో పూజా పాల్ ను పార్టీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే, సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(akhilesh-yadav) ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. 

Also Read: PM Modi on Trump Tariffs: ప్రపంచ మార్కెట్ లో ఆధిపత్యం మనదే అవ్వాలి..టారీఫ్ ల నేపథ్యంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు