Trump-Putin Meet: ఈరోజే ట్రంప్, పుతిన్ భేటీ..విఫలం కావచ్చు అంటున్న అమెరికా అధ్యక్షుడు

అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ జరగనుంది. ఈ సమావేశంపై ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య శాంతి ఒప్పందం జరగాలనే ఉద్దేశంతో ఈ భేటీ జరుగుతోంది.

New Update
trump-putin

Donald Trump-Vladimir Putin

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆపేస్తుందా..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృషికి ఫలితం లభిస్తుందా..ప్రపంచం అంతా ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే ట్రంప్ , పుతిన్ భేటీ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రష్యా అధ్యక్షుడు కాల్పుల విరమణకు ఒప్పుకంటే ఒక్క ఉక్రెయిన్ కే కాదు అమెరికాతో పాటూ చాలా దేశాలకు లాభం చేకూరుతుంది. రష్యాతో అమెరికా సంబంధాలు మెరుగుపడతాయి. భారత్ వంటి దేశాలపై అదనపు సుంకాల భారం తీసేయవచ్చును. ప్రస్తుతం సుంకాల కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెర తీశారు. రష్యా నుంచి చమురు కొంటున్నారనే నెపంతో ఇండియా మీద 50 శతం సుంకాలను విధించారు. దీనికి భారత్ ఒప్పుకోలేదు. రష్యా, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు ఇండియాకు మద్దతుగా నిలిచాయి. 

శాంతి ఒప్పందం కుదురుతుందా..

ఇక ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాక ముందు నుంచి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. తన ఎన్నికల ప్రచారంలో కూడా ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పుతానని చెప్పారు. 24 గంటల్లోనే యుద్దాన్ని ఆపిస్తానని ప్రగల్భాలు పలికారు. అయితే అమెరికా అధ్యక్షుడు అనుకున్నది ఏమీ జరగలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయనకు కొరకరాని కొయ్యలా మారారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పుతిన్ తో భేటీకి ప్రయత్నిస్తూనే ఉన్నారు.  కానీ ఆయన ఎప్పటికప్పుడు దాటవేస్తూ వచ్చారు. ఫిబ్రవరిలో జెలెన్‌స్కీతో ట్రంప్‌ భేటీ తర్వాత పరిణామాలు పుతిన్‌కు అనుకూలంగా మారినట్లే కనిపించారు. కానీ ట్రంప్ ఆశలన్నీ కల్లలే అయ్యాయి. రష్యా దాడులు చేస్తూనే ఉంది. చాలాసార్లు ఫోన్ ద్వారా చెప్పడానికి ప్రయత్నించారు కానీ కుదరలేదు. దీంతో పుతిన్ పట్ల ట్రంప్ అసహనం పెరుగుతూ వచ్చింది. అది ఇప్పటికి చాలా పెరిగిపోయింది. అమెరికా అధ్యక్షుడు పుతిన్ పై మాటలతో చాలా సార్లు దాడి చేశారు. పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నారు అన్నారు. అదనపు సుంకాలతో విరుచుకుపడతామని బెదిరించారు. కానీ రష్యా దేనికీ తగ్గలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి...మా వైఖరి మాదే అని ఎదురిస్తూ వచ్చింది.

భేటీ ఖరారు తర్వాత ట్రంప్ వ్యాఖ్యలు...

పుతిన్ తో భేటీ ఖరారు అయిన తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై చాలాసార్లు చాలా వ్యాఖ్యలు చేశారు. ఇదొక భావోద్వేగ సమావేశం అన్నారు. వివాదాన్ని పరిష్కరించేదిగానే కాకుండా చాలా రకాలుగా  ఉండొచ్చని చెప్పారు. మరోవైపు రష్యా యుద్ధాన్ని ఆపడానికి ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని...అవి ఏవైనా కావొచ్చని హెచ్చరించారు. తాజాగా గురువారం పుతిన్ తో సమావేశం విఫలం అవ్వొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.  అలాగే ఆయనతో ఎలాంటి ఒప్పందాన్ని ఖరారు చేయనని..ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ని ఏ నిర్ణయాల్లోనైనా చేర్చుకుంటానని చెప్పారు. మరోవైపు పుతిన్ ఇప్పటికే అలస్కా చేరుకున్నారు. ఇరు దేశాధినేతల మధ్యనా అలస్కాలోని యూఎస్ ప్రధాన సైనిక స్థావరం అయిన ఎల్మండోర్ప్ వైమానిక దళ స్థావరంలో జరగనుంది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయి. 

Also Read: PM Modi: అణ్వస్త్ర బెదిరింపులను సహించేది లేదు..ప్రధాని మోదీ

Advertisment
తాజా కథనాలు