Red Fort: భారత్‌పై బంగ్లాదేశ్ భారీ కుట్ర.. ఎర్రకోట టార్గెట్.. ఐదుగురు అరెస్టు!
దేశ రాజధానిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు బంగ్లా వాసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా అక్రమ వలసదారులని తేల్చారు పోలీసులు
దేశ రాజధానిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు బంగ్లా వాసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా అక్రమ వలసదారులని తేల్చారు పోలీసులు
తాను మొఘలుల వారసుడి భార్యనని, ఎర్రకోట తనకు ఇప్పించాలని కోరుతూ సుల్తానా బేగమ్ అనే మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొఘల్ పాలకుడు బహదూర్ షా జాఫర్ కు తన దివంగత భర్త మహ్మద్ బీదర్ బఖ్త వారసుడని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ ను సుప్రీం కొట్టేసింది.
ఎర్రకొటను తమకు అప్పగించాలని మొఘల్ వారసులు గతంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. బ్రిటిషు వారు స్వాధీనం చేసుకున్న 150 ఏళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది.
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరికొద్దిసేపట్లో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని న్యూఢిల్లీ పూర్తి స్థాయిలో సిద్ధమైంది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో మణిపూర్ హింసను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. దేశం మణిపూర్ ప్రజల వెంటే ఉందని ప్రధాని మోదీ అన్నారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తల్లులు, కూతుళ్ల గౌరవానికి గండి పడిందని మోదీ అన్నారు.
Terror Strikes On August 15 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌లో విధ్వంసం సృష్టించాలని ఉగ్రసంస్థలు కుట్రలు చేస్తున్నాయి. భద్రతా సంస్థలు, రైల్వే స్టేషన్లు, సినిమాహాల్స్ లాంటి బహిరంగ ప్రదేశాలే టార్గెట్ దాడులు చేయాలని కుట్రలు పన్నుతున్నట్టు నిఘా వర్గాల సమాచారం. ముఖ్యంగా దేశ రాజధానిని ముష్కరులు తమ మెయిన్ టార్గెట్ చేసుకున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ఆగస్టు 15న దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఎర్రకోట చుట్టూ భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర ఏజెన్సీల నుంచి అందిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా పోలీసులు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. ముఖ్యమైన సంస్థల వద్ద అదనపు పికెట్లను మోహరించారు.
భారత స్వాతంత్ర్య వేడుకలను ఈ సారి అత్యంత ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రత్యేక అతిథులకు కేంద్రం ఆహ్వానం పంపింది. జన్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా ఈ సారి వేడుకలకు సుమారు 1800 మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం పంపినట్టు అధికారులు వెల్లడించారు.