/rtv/media/media_files/2025/09/02/would-give-up-everything-she-had-for-her-instagram-boyfriend-2025-09-02-11-37-50.jpeg)
would give up everything she had for her Instagram boyfriend
వారిది 13 ఏళ్ల అనుబంధం. అందులోనూ ప్రేమ వివాహం(Love Marriage) ఆ బంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు... అయినా ఆమె అవన్నీ కాదనుకుంది.ఇన్‌స్టాలో పరిచయమైన ప్రియుడితో వెళ్లిపోవాలని నిర్ఱయించుకుంది. దీంతో భర్త ఆవేశంతో ఆమెపై దాడిచేసి తను ఆత్మహత్యయత్నం చేయడం కలకలం రేపింది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read : Weather Update: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు!
Instagram Love Incident
జగద్గిరిగుట్ట సీఐ నర్సింహా తెలిపిన ప్రకారం... కరీంనగర్జిల్లా వీణవంకకు చెందిన వాసాల శ్రీధర్(34), ఖమ్మంకు చెందిన కల్యాణి ఓ రాంగ్ ఫోన్‌కాల్ ద్వారా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆ తర్వాత ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి 13 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారికి 11 ఏళ్లు, తొమ్మిదేళ్లు, ఏడేళ్ల వయసున్న ముగ్గురు కుమారులున్నారు. . శ్రీధర్ కుటుంబం జీవనోపాధి కోసం హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు వచ్చి కుటుంబంతో కలిసి ఎల్లమ్మబండ, పీజేఆర్ కాలనీలో నివాసముంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
Also Read : BIG BREAKING: హరీశ్ రావుకు KTR సపోర్ట్.. వీడియోతో సంచలన ట్వీట్
కల్యాణి ఇంటివద్దే ఉంటూ పిల్లలను చూసుకుంటోంది. భర్త ప్రైవేటు ఉద్యోగి. ఇన్‌స్టాగ్రామ్(Instagram) లో చురు గ్గా ఉండే కల్యాణికి కొన్నాళ్లుగా ఏపీలోని కర్నూలుకు చెందిన వ్యక్తితో ఆ వేదికగా పరిచయం ఏర్పడి.. ప్రేమ(Instagram Love Incident) గా మారింది. నిత్యం అతడితో ఆమె ఫోన్లో మాట్లాడుతోంది. ఈ విషయాన్ని గమనించిన భర్త పద్ధతి మార్చుకోవాలని చాలాసార్లు నచ్చజెప్పాడు. కల్యాణి భర్త మాట పట్టించుకోలేదు. ఆ వ్యక్తితో మాటలు కొనసాగించింది.
ఫలితంగా శ్రీధర్, కల్యాణి మధ్య గొడవలు మొదలయ్యాయి. విడాకులిచ్చేస్తానని భర్తను కల్యాణి హెచ్చరించింది. వీరి గొడవ పంచాయతీ పెద్దల దాకా వెళ్లింది, వారు సర్దిచెప్పినా..కల్యాణి ప్రవర్తన మార్చుకోలేదు. ప్రియుడికోసం.. భర్త, పిల్లలను వదులుకునేందుకే సిద్ధపడింది. దీంతో సోమవారం ఉదయం భార్యాభర్తల మధ్య మరోసారి వాగ్వాదం(Wife & Husband War) జరిగింది. ఇళ్ల వదిలి వెళ్లడానికి సిద్ధపడిన కల్యాణిపై శ్రీధర్ కత్తితో దాడి చేశాడు. ఆమె మెడ, ముఖం, చేతులపై విచక్షణారహితంగా దాడిచేశాడు. అనంతరం తానూ చనిపోతానంటూ శ్రీధర్ తన రెండు చేతులను అదే బ్లేడ్‌తో మణికట్టు వద్ద కోసుకున్నాడు. భర్తను కాపాడాలని అరుస్తూ కల్యాణి ఇంట్లోంచి బయటకు పరుగెత్తింది. ఇంటి పక్కన ఉంటున్న ఓ వ్యక్తి పరిస్థితిని గమనించి.. ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాడు. కల్యాణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదైంది.
Also Read : Weather Update: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు!