/rtv/media/media_files/2025/07/17/amarnath-yatra-1-2025-07-17-18-09-31.jpg)
అమర్‌నాథ్ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. గండేర్‌బల్ జిల్లాలోని బాల్తాల్ యాత్ర మార్గంలో రాళ్లు మీద పడి మహిళ ప్రాణాలు కోల్పోయింది. జూలై 17న లోయలో భారీ వర్షం కారణంగా అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. అంతేకాదు బుధవారం ఈ మార్గంలో కొండచరియలు విరిగిపడి మరో ముగ్గురు గాయపడ్డారు. జూలై 3న ప్రారంభమైన ఈ యాత్రను ఈ సంవత్సరం జమ్మూ నుంచి నిలిపివేయడం ఇదే మొదటిసారి.
ఇది కూడా చూడండి:Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
Also read : Jammalamadugu : చంపింది అన్నేనా.. గండికోట యువతి మర్డర్ మిస్టరీలో బిగ్ అప్డేట్!
Amarnath Yatra Suspended
A woman pilgrim lost her life while three others sustained injuries in a landslide along Baltal route of Amarnath Yatra in Jammu and Kashmir’s Ganderbal district while authorities have suspended the Yatra temporarily for 1 day, due to safety concerns pic.twitter.com/PU1JhpRSmj
— Kashmir Post (@KashmirPostNews) July 17, 2025
బాల్టాల్ మార్గంలో ట్రాక్‌పై పెద్ద సంఖ్యలో పర్యటకులు చిక్కుకుపోయారు. వందల వంది భక్తులు రోడ్లపై నిలిచిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒకటి ఇద్దరు భక్తులు బురద ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిని ట్రాక్‌పై ఉన్న వ్యక్తులు రక్షించారు. NDRF, SDRF బృందాలను వెంటనే ప్రమాద స్థలానికి పంపించి ప్రజలను తరలిస్తున్నారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ యాత్ర ట్రాక్‌పై పునరుద్ధరణ పనులను ప్రారంభించింది. పునరుద్ధరణ పనులు పూర్తయ్యే వరకు యాత్ర నిలిపివేయబడుతుందని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 2లక్షలకు పైగా యాత్రికులు 3,880 మీటర్ల ఎత్తైన ఈ మందిరాన్ని దర్శించుకున్నారు. ఆగస్టు 9న ముగియనున్న ఈ యాత్ర కోసం వేలాది మంది సైనికులు, పారామిలిటరీ సిబ్బంది, పోలీసులను మోహరించారు.
Also Read : BIG BREAKING: వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్.. మళ్లీ అరెస్ట్?
Also Read : Amberpet: మతాంతర వివాహం చేసుకుని.. ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య
Amarnath pilgrims | jammu and kashmir news | latest-telugu-news | amarnath-yatra-to-be-temporarily-suspended