Earning Money: ఇంట్లో ఉండి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా.. అయితే ఈ రెండు యాప్స్ మీ మొబైల్‌లో ఉండాల్సిందే!

ఇంట్లోనే ఉండి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్‌ ప్రమోట్ లేదా సబ్‌స్క్రిప్షన్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. వాట్సాప్‌లో రిఫరల్ లింక్‌ల ద్వారా సంపాదించవచ్చని నిపుణులు అంటున్నారు.

New Update
Money

Money

ప్రస్తుతం  రోజుల్లో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు వాడుతున్నారు. ఎంత బిజీగా ఉన్నా కూడా స్మార్ట్‌ఫోన్‌లో లీనమైపోతున్నారు. స్మార్ట్‌ఫోన్ ఇలా చూస్తూ ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని నిపుణులు అంటున్నారు. ఇంట్లోనే ఉండి నెలకు లక్షలు సంపాదించే మార్గాలు డైలీ మనం ఉపయోగించే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాయి. అయితే వీటి ద్వారా ఇంట్లో ఉండి డబ్బు సంపాదించడం ఎలాగో తెలియాలంటే మీరు ఈ స్టోరీపై ఓ లుక్కేయాల్సిందే.

ఇది కూడా చూడండి: Elon Musk sues: ఓపెన్ AI, ఆపిల్‌కు BIG SHOCK.. చాట్ GPTపై కేసు వేసిన ఎలన్ మస్క్

ఇన్‌స్టాగ్రామ్ నుంచి డబ్బు సంపాదించడం ఎలా?

ఇన్ఫ్లుయెన్సర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో రాణించే వారు ఈజీగా డబ్బు సంపాదించవచ్చు. ఫాలోవర్లు  ఉంటే ఒక బ్రాండ్‌కి సంబంధించిన ఉత్పత్తులను ప్రోత్సహిస్తే వారు మీకు డబ్బులు చెల్లిస్తారు. అయితే మీకు సోషల్ మీడియాలో ఉన్న  ఫాలోవర్స్ బట్టి వారు డబ్బులు ఇస్తారు. దీనివల్ల మీరు ఇంట్లోనే ఉండి బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. వాటిని ప్రమోట్ చేయడం వల్ల డబ్బులతో పాటు ఆ బ్రాండ్‌కి సంబంధించిన వస్తువులు కూడా ఇస్తారు. అలాగే మీరు ఆ వస్తువుల లింక్‌ను సోషల్ మీడియాలో పంచుకోవచ్చు. ఆ లింక్‌లపై ఎవరైనా క్లిక్ చేసి కొనుగోలు చేస్తే మీకు కమిషన్ కూడా లభిస్తుంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో మానిటైజేషన్ టూల్ -ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు తమ డబ్బును ఈజీగా సంపాదించవచ్చు. దీనిలో మీరు  సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకుని వారి కోసం ప్రత్యేక కంటెంట్‌ను షేర్ చేయవచ్చు. దీని కోసం మీరు ప్రతీ నెలా వారి దగ్గర నుంచి సబ్‌స్క్రిప్షన్ ఫీజు కూడా తీసుకోవచ్చు. ఇలా మీరు ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించి ధనవంతులు కావచ్చు.

వాట్సాప్‌ నుంచి డబ్బు సంపాదించడం ఎలా?

ఒక బ్రాండ్ ఉత్పత్తులను వాట్సాప్ ద్వారా గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి విక్రయించవచ్చు. అనుబంధ మార్కెటింగ్ -ఈ-కామర్స్ కంపెనీలకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీటిలో మీరు చేరి ఆ లింక్‌లను స్టేటస్, వాట్సాప్ గ్రూప్‌ల్లో షేర్ చేయడం వల్ల కొందరు కొనుగోలు చేస్తారు. మీరు షేర్ చేసిన ఆ లింక్ ద్వారా ఎవరైనా కొనుగోలు చేస్తే మీకు కమిషన్ వస్తుంది. ఇలా మీరు డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు. అలాగే పెయిడ్ వాట్సాప్ గ్రూపులను సృష్టించడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. మీరు ఏదైనా రంగంలో నిపుణులు అయి ఉంటే ఒక కమ్యూనిటీని సృష్టించి అందులో ప్రత్యేకమైన కంటెంట్ వేయాలి. వీటికి మీరు సబ్‌స్క్రిప్షన్ ఫీజులు కూడా వసూలు చేయవచ్చు. అలాగే యాప్ రిఫరల్‌ను మీ స్నేహితులకు షేర్ చేయవచ్చు. ఈ లింక్ ద్వారా ఎవరైనా కొనుగోలు చేస్తే మీకు రిఫరల్ రివార్డులు వస్తాయి. 

ఇది కూడా చూడండి: WhatsApp: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఇప్పుడు చాటింగ్ మరింత ఈజీ!

Advertisment
తాజా కథనాలు