/rtv/media/media_files/2025/07/16/aadhaar-card-2025-07-16-14-13-43.jpg)
Aadhaar Card
ఐదేళ్లు దాటిని పిల్లలు ఉన్న తల్లిదండ్రులను UIDAI శుభవార్త చెప్పింది. తమ పిల్లలకు ఆధార్ అప్‌డేషన్ కోసం ఇకపై ప్రభుత్వ ఆఫీసుల నుంచి తిరిగే ఇబ్బందులు తొలిగిపోనున్నాయ్. స్కూల్‌లో చేర్పించే సమయంలో బాల ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు. కానీ వారికి ఐదేళ్లు దాటిన తర్వాత ఆధార్ కార్డు అప్‌డేషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలా ఐదేళ్ల వయసు దాటిన తర్వాత ఆధార్ కార్డు అప్‌డేషన్ చేయించుకోని చిన్నారులు దేశవ్యాప్తంగా 7కోట్ల మందికిపైగా ఉన్నట్లు యూఐడీఏఐ తాజాగా వెల్లడించింది. 5 నుంచి 7 ఏళ్ల మధ్య చిన్నారులకు అప్‌డేషన్ కోసం ఎలాంటి ఫీజు అవసరం లేదు. అయితే ఏడేళ్లు దాటితే మాత్రం రూ.100 చెల్లించాలి. ఇక 15 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా ఆధార్‌కు రెండోసారి ఎంబీయూ తప్పనిసరి. ఈ నేపథ్యంలో 15 ఏళ్లు పూర్తయిన పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం కూడా ఇదే విధానాన్ని స్కూళ్లు, కాలేజీల ద్వారా అమలు చేయాలని అనుకుంటున్నట్లుగా భువనేశ్ కుమార్ తెలిపారు.
Also Read : భారతీయులు 59 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు.. ఎలానో తెలుసా?
Aadhaar Update In Schools
UIDAI Urges Parents and Guardians to Update Children’s Aadhaar Biometrics; Free Between Ages 5 and 7
— Selvam 🚩 (@tisaiyan) July 16, 2025
Mandatory Biometric Update Enables Seamless Access to School Admissions, Entrance Exams, Scholarships, and DBT Benefitshttps://t.co/c5QXGFsQ19
Also Read : సరూర్‌నగర్ కిడ్నీరాకెట్ కేసులో కీలక పరిణామం..సీఐడీ చేతికి చిక్కిన సూత్రదారి
UIDAI kicks off school‑based biometric updates for 7 crore+ children in the next 2 months—free till age 7, or risk Aadhaar deactivation. Seamless, accessible, essential.👇
— Business Times (@BusinessTimesIn) July 21, 2025
🔗 https://t.co/LvMRenOoMX#UIDAI#Aadhaar#Biometrics#DigitalIndia#ChildWelfare
Also Read : ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ఉరుములతో కూడిన భారీ వర్షాలు
అలాంటి వారికోసం యూఐడీఏఐ మంచి అవకాశం తీసుకొస్తోంది. పిల్లలు చదువుకునే స్కూళ్లలోనే ఆధార్ అప్‌డేషన్ చేసే విధంగా ఒక ప్రాజెక్టును ప్రారంభించినట్లు యూఐడీఏఐ సీఈవో భువనేశ్ కుమార్ తెలిపారు. అనేక ప్రభుత్వ పథకాల అమలులో ఆధార్ కార్డు కీలకం. ప్రతి చిన్నారికి అవసరమైన ప్రయోజనాలు సమయానికి అందాలంటే ఇది తప్పనిసరి అని భువనేశ్ కుమార్ తెలిపారు. అందుకే స్కూల్లో ఈ ఆధార్ కార్డు అప్‌డేషన్ ప్రక్రియను ఈసీగా పూర్తి చేయాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ మెషిన్లను పంపించి, ప్రతి పాఠశాలలో ఆధార్ అప్‌డేషన్ ప్రక్రియను అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి స్కూల్‌కు వెళ్లి ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేషన్ చేసేందుకు కావాల్సిన టెక్నాలజీని పరీక్షిస్తున్నామని.. మరో 45 నుంచి 60 రోజుల్లో ఇది సిద్ధమవుతుందని పేర్కొన్నారు.
Also Read : ఇనుప మంచం, పరుపు, కుర్చీ.. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి రాజభోగాలు!
latest-telugu-news | aadhar-update | aadhar-card | aadhar-free-updation