/rtv/media/media_files/2025/12/02/musk-1-2025-12-02-08-23-15.jpg)
జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చాలా విషయాలు మాట్లాడారు. ఇందులో తన వ్యక్తిగత జీవిత విషయాలను కూడా పంచుకున్నారు. ఇందులో ఒక రహస్యాన్ని బయటపెట్టారు. భారత్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తన భార్య పేరు శివోన్ జిలిస్‌కు భారతీయ మూలాలు ఉన్నాయని ఎలాన్ మస్క్ చెప్పారు. తన భార్య సగం భారతీయురాలని స్పష్టం చేశారు. ఆమె తల్లి పంజాబీ మూలాలు కలిగిన మహిళ అని స్పష్టం చేశారు. అయితే శిశువుగా ఉన్నప్పుడే శివోన్‌ను వేరే కుటుంబం దత్తత తీసుకుందని మస్క్ వివరించారు. ఆమె కెనడాలో పెరిగారని..దత్తత వలన ఆమె ఇండియన్-అమెరికన్‌గా ఎదిగారన్నారు. అందుకే తన కుమారుల్లో ఒకరి పేరులో శేఖర్ అనే పదం ఉంటుందని తెలిపారు. నోబెల్ గ్రహీత సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ పేరులో నుంచి 'శేఖర్' అనే పదం కలిసొచ్చేలా పేరు పెట్టామని చెప్పుకొచ్చారు.
శివోన్జిలిస్..
మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ న్యూరాలింక్‌లో ఆపరేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా శివోన్ పని చేస్తున్నారు. ఈమె యాల్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్, ఫిలాసఫీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆమె ఐస్ హాకీ జట్టులో సభ్యురాలిగా కూడా ఉన్నారు. అనంతరం ఐబీఎం, బ్లూమ్‌బర్గ్‌లో పనిచేశారు. 2016లో జిలిస్ఓపెన్‌ఏఐలో చేరారు. ఆ తర్వాత 2017లో న్యూరాలింక్‌లో చేరారు. ఇక్కడ ఉండగానే శివోన్ ను మస్క్ పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరికీ నలుగురు సంతానం. 2014 ఫిబ్రవరి నెలలోనే కుమార్తె ఆర్కాడియా పుట్టింది. ఆ తర్వాత కుమారుడు సెల్డాన్లైకుర్గస్ జన్మించాడు. ఇక 2021లో వీరికి కవలలుస్ట్రైడర్, అజూర్ జన్మించారు. వీరిలో ఒక కొడుకు పేరులో శేఖర్‌ను చేర్చారు.
మొత్తం 15 మంది పిల్లలు..
అయితే ఎలాన్ మస్క్ కు శివోన్ ఒక జీవిత భాగస్వామి మాత్రమే. ఈయనకు పలువురు భాగస్వాములు ఉన్నారు. వారందరికీ కలిపి మస్క్ కు మొత్తం 15 మంది పిల్లలు ఉన్నారు. మస్క్ అతని మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఐదుగురు పిల్లలు కనగా.. గాయని గ్రిమ్స్‌తో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాడు. సెయింట్ క్లైర్‌తో ఒకరికి జన్మను ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు పిల్లలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: H-1B Visa: దారుణంగా పడిపోయిన హెచ్-1 బీ వీసా పిటిషన్లు..పదేళ్ల కనిష్టానికి..
Follow Us