/rtv/media/media_files/2025/08/30/girl-marriage-2025-08-30-07-03-36.jpg)
girl love marriage
తెలుగు సినిమాల్లో ఎన్నో ట్విస్టులు ఉంటాయి. అంతకు మించిన ట్విస్టులు ఓ రియల్ లైఫ్ స్టోరీ(Life Story) లో చోటుచేసుకున్నాయి. చిరంజీవి నటించిన ‘బావగారు బాగున్నారా’ సినిమా చూశారా, లేదా సాయి ధరమ్ తేజ్ నటించిన సుబ్రమణ్యం ఫర్ సేల్ ఈ సినిమా.. ఇప్పుడు మనం చెప్పుకునే సంఘటన ఈ రెండు సినిమాల్లో స్టోరీకి దగ్గరగా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న ఓ యువతికి ఎదురుదెబ్బ తగిలింది. లవర్ కోసం ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చింది. చివరి నిమిషంలో అతని అసలు రంగు బటయపడింది. తర్వాత ఆమె ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.
Also Read : మా నాన్న అస్థికలు తెప్పించండి ఫ్లీజ్: ప్రభుత్వాన్ని కోరిన నేతాజీ కుమార్తె
Lover Cheating Girl In Indore
ఇండోర్(Indore) కు చెందిన శ్రద్ధా తివారీ అనే యువతి, ఆమె ప్రియుడితో కలిసి జీవించడానికి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. అయితే, ఆగస్ట్ 23న రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ఆమె ప్రియుడు ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రద్ధ, రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. సరిగ్గా అదే సమయంలో కరణ్ యోగి అనే ఎలక్ట్రీషియన్ ఆమెను చూసి కాపాడాడు. జరిగిందేంటో తెలుసుకున్నాడు. అతన్ని మరిచిపోయి ఇంటికి వెళ్లిమని కరణ్ ఆమెకు చెప్పాడు. ఆమె అందుకు అంగీకరించలే. తాను పెళ్లి చేసుకుందామని వచ్చానని ఇంట్లో నుంచి వచ్చానని పెళ్లి చేసుకొనే ఇంటికి వెళ్తానని శ్రద్ధ చెప్పింది. అనంతరం వీరిద్దరి మధ్య మాటలు కలిశాయి. శ్రద్ధా పరిస్థితిని అర్థం చేసుకున్న కరణ్ ఆమెకు ధైర్యం చెప్పాడు. ఊహించని విధంగా ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. ప్రియుడి మోసంతో నిరాశలో ఉన్న శ్రద్ధా, కరణ్ ప్రపోసల్‌ను అంగీకరించింది. వీరిద్దరూ మహేశ్వర్‌లోని ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కరణ్ కుటుంబం వారిని అంగీకరించకపోవడంతో, వారు మరో ప్రాంతానికి వెళ్లారు.
‘Jab We Met’ In Indore: Woman Runs Away To Marry Lover, Returns Wedded To Another https://t.co/8yVVPymDDd - #bharatjournal#news#bharat#india
— Bharat Journal (@BharatjournalX) August 29, 2025
Also Read : అమిత్ షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి.. TMC ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఈలోగా శ్రద్ధా కుటుంబ సభ్యులు ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిపిన వారికి రూ.51,000 రివార్డు కూడా ప్రకటించారు. చివరికి శ్రద్ధా స్వయంగా ఆమె తండ్రిని కలిసింది. అప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. శ్రద్ధా తండ్రి ఆమెను ఇంటికి తిరిగి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ జంటను పోలీసులు విచారిస్తున్నారు. శ్రద్ధా తన 10 రోజులు ఆలోచించుకుని, తర్వాత కూడా ఇదే పెళ్లిని కొనసాగించాలనుకుంటే అంగీకరిస్తానని ఆమె తండ్రి తెలిపినట్లు సమాచారం. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రేమలో మోసం, ఊహించని మలుపులతో ఈ కథ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.