/rtv/media/media_files/2025/05/17/FZihzPY2Uom63M4eZn8D.jpg)
Turkey Destination Wedding
పాకిస్తాన్‌కు సపోర్ట్ చేసిన తుర్కియేకు భారత్ మరో గట్టి దెబ్బ ఇచ్చింది. డెస్టినేషన్ వెడ్డింగ్ వల్ల ఆ దేశానికి రూ.770 కోట్ల నష్టం వాటిళ్లనుందని నిపుణులు చెబుతున్నారు. గత కొంత కాలం నుంచి తుర్కియే డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కేంద్రంగా మారింది. ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇస్తాంబుల్ ప్యాలెస్‌లు, తీర ప్రాంతాలు ఉండటంతో చాలా మంది ఇక్కడికి వెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: RCB VS KKR: జోష్ మళ్ళీ మొదలు..ఈరోజు నుంచి ఐపీఎల్ రీస్టార్ట్
There is nothing 🤡 about Indians wanting to boycott Turkey. 300,000 tourists spending $3300 is still $1 billion in loss to Turkey. Even spending $330 is $100m in loss.
— Aravind (@aravind) May 15, 2025
Not a small amount. What is 🤡 is the holier than thou attitude looking down on Indians who want to boycott. pic.twitter.com/0VzgjU75SC
ఇది కూడా చూడండి: Oppo Reno 14 5G Series: కిర్రాక్ మావా.. అప్పు చేసైనా ఒప్పో కొనేయాల్సిందే - ఫోన్లు అదిరిపోయాయ్!
ఒక్కో వివాహానికి 3 మిలియన్ డాలర్ల పైనే..
గత కొన్నేళ్ల నుంచి భారత్ నుంచి తుర్కియే వెళ్లే వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ వల్ల ఆ దేశ పర్యాటక రంగానికి ఏటా సగటున 140 మిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తోంది. ఒక్కో వివాహానికి దాదాపుగా 3 మిలియన్ డాలర్ల పైనే ఖర్చు అవుతుంది. అంటే ఇది ఇండియన్ కరెన్సీలో రూ.25 కోట్లు పైమాటే. ఇంకా గ్రాండ్‌గా చేసుకుంటే 8 మిలియన్ డాలర్లు (రూ.68 కోట్లు) వరకు ఖర్చ అవుతుంది.
ఇది కూడా చూడండి: Pre-Diabetes: ప్రీడయాబెటిస్, ఊబకాయం ఉన్నవారు కొన్ని పండ్లను ఎందుకు నియంత్రణలో తినాలి
దీంతో పాటు పెళ్లికి వచ్చే అతిథుల లోకల్ టూర్‌తో మరింత ఆదాయం సమకూరుతోంది. అయితే తాజాగా బాయ్‌కాట్ తుర్కియే నిరసన స్టార్ట్ కావడంతో 2000 మంది టూరిస్టులు రద్దు చేసుకున్నారు. ఇండియా నుంచి 30 జంటలు తుర్కియేలో వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. వీటిని క్యాన్సిల్ చేసుకోవడం వల్ల తుర్కియేకు దాదాపుగా 90 మిలియన్ డాలర్ల అంటే ఇండియన్ కరెన్సీలో రూ.770 కోట్ల ఆదాయం నష్టం రానుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Russia-Ukraine: రష్యా వీలు కాని డిమాండ్లు పెడుతోంది.. ఉక్రెయిన్ ఆరోపణ
ఇదిలా ఉండగా భారత్, పాక్ యుద్ధ వాతావరణంలో తుర్కియే బహిరంగంగా పాక్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో భారత్ ఆ దేశంతో అన్ని విధాలుగా వాణిజ్య సంబంధాలను తెంచుకుంటోంది. పండ్ల వ్యాపారాలు, ఆభరణాల వర్తకులు దిగుమతులను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
latest-telugu-news | destination-wedding