కేజ్రీవాల్ ఓటమి? | AAP Voting Result In Delhi Elections 2025 | Arvind kejriwal | Pm Modi | RTV
ఢిల్లీ అధికారం బీజేపీదేనని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ బీజేపీకి 39-44, పీపుల్ పల్స్ 51-60, మ్యాట్రిజ్ 35-40, పీపుల్స్ ఇన్ సైట్ 40-44, రిపబ్లిక్ పీ మార్క్ 39-49, పోల్ డైరీ 42-50, జేవీసీ పోల్ 39-45 వస్తాయని చెబుతున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగగా 57.70 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. బీజేపీ 51- 60 సీట్లు గెలవబోతున్నట్లు పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడించాయి.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 46.55 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్(తూర్పు), యూపీలోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు 55 సీట్లు వస్తాయని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. స్లమ్ ఏరియా వాళ్లకి 3 -5 వేలు ఆశచూపి వాళ్లు ఓటు వేయకుండా చేతి వేళ్లకు సిరా వేయాలని బీజేపీ ప్లాన్ వేసిందన్నారు. దీన్ని అరికట్టేందుకు తాము ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు 38- 40 సీట్లు, బీజేపీకి 31-33, కాంగ్రెస్ 0 సీట్లు వస్తాయని ఫలోడి సత్తా బజార్ అనే సర్వే అంచనా వేసింది. ఇక వీప్రిసైడ్ అనే సర్వే కూడా ఆప్‌కు 50-55, బీజేపీకి 15-20, కాంగ్రెస్‌కు 0 సీట్లు వస్తాయని వెల్లడించింది.
ఢిల్లీ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆప్ ను దెబ్బ కొట్టేందుకు ఏ అవకాశాన్ని వదలాలనుకోలేదు. ఇందులో భాగంగానే పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం పెంచిందని అంటున్నారు. ఐటీ దెబ్బ ఆప్ మీద గట్టిగానే పడనుందని చెబుతున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరో ఐదు రోజుల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు.
ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు ఇవి యమునా నది చుట్టూరానే తిరుగుతున్నాయి. ఆప్, బీజేపీలు ఈ నది నీళ్ళ విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యమునా నదిలో బోటులో ప్రయాణించారు.