/rtv/media/media_files/2025/05/17/o14NQpgBiv7xZS2GG5Im.jpg)
ci-slapping
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా బాను వివాదంలో చిక్కుకున్నారు. ఓ అటెండర్ ను ఆమె చెప్పుతో చెంపపై కొట్టారు. తన పేరు చెప్పి అక్రమ మద్యం అమ్ముతున్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకేం తెలియదని అటెండర్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అయినప్పటికీ ఆమె వినిపించుకోకుండా ఆగ్రహంతో అతనిపై చేయిచేసుకుంది. అనంతపురం ఎక్సైజ్ స్టేషన్ లో రెండు రోజుల క్రితమే ఈ ఘటన జరగగా.. తాజాగా వీడియో బయటకొచ్చింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. దీనిపై అధికారులు ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో మద్యం అక్రమంగా అమ్ముతున్న వారి నుంచి సదరు సీఐ ప్రతి నెలా డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భానుపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Also Read : Period Problems: పీరియడ్స్ సమయంలో ఈ పదార్ధాలు తింటే సమస్య అధికంగా ఉంటుందా..?
Also Read : Tamannaah VVAN Movie Poster: వణుకు పుట్టిస్తున్న తమన్నా కొత్త మూవీ పోస్టర్..
Kalyanadurgam Excise CI Haseena Bhanu
అనంతపురం జిల్లా అటెండర్ను చెప్పుతో కొట్టిన మహిళా ఎక్సైజ్ సీఐ
— Pavan Reddy (@Pa1_Redde) May 17, 2025
కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
అటెండర్ ను ఆమె చెప్పుతో కొట్టారు.
తన పేరు చెప్పి అక్రమ మద్యం అమ్ముతున్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకేం… pic.twitter.com/lDOUPp4NeC
Also Read : Aamir Khan: 'జాతీయ జెండా' DPతో అమీర్ ఖాన్ కొత్త స్ట్రాటజీ.. సోషల్ మీడియాలో #BoycottAamirKhan ట్యాగ్స్
Also Read : Rohit Sharma Parents Emotional: ఎమోషనల్ అయిన రోహిత్ తల్లిదండ్రులు.. భార్య రితిక కూడా ఏడుస్తూ!
Andhra Pradesh | Kalyanadurgam Excise CI | ananthapur