మెగా ఫ్యాన్స్కు బిగ్ షాక్‌.. భారీగా తగ్గిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్

రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ మిక్సుడ్ టాక్ ను సంపాదించుకుంది.  తొలిరోజు ఇండియాలో ఈ మూవీ రూ.  47 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ చాలా తక్కువేనని చెప్పాలి.

New Update
ram charan's game changer

ram charan's game changer Photograph: (ram charan's game changer )

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్.  కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.  సంక్రాంతి కానుకాగా జనవరి 10వ తేదీన గ్రాండ్ గా రిలీజైన ఈ మూవీ మిక్సుడ్ టాక్ ను సంపాదించుకుంది.  తొలిరోజు ఇండియాలో ఈ మూవీ రూ.  47 కోట్లు వసూలు చేసింది.  తెలుగులో రూ. 38 కోట్లు, తమిళంలో రూ. 2 కోట్లు వసూలు చేసింది. ఇక హిందీ విషయానికి వస్తే ఈ సినిమా రూ. కోట్ల రూపాయలను రాబట్టింది. కన్నడలో రూ.  0.1 కోట్లు, మలయాళంలో రూ.  0.03 కోట్లు రాబట్టింది.  

దీంతో రామ్ చరణ్ హీరోగా  బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ ఫస్ట్ డే కలెక్షన్స్ ను ఈ చిత్రం బీట్ చేసింది.  కానీ  ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ చాలా తక్కువేనని చెప్పాలి. సంక్రాంతి పండగ కావడంతో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.   ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న తొలి సోలో చిత్రం గేమ్ ఛేంజర్. 2019 బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ చిత్రంలో కూడా యాదృచ్ఛికంగా కియారానే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఫస్ట్ డే రూ. 34 కోట్ల ఓపెనింగ్‌ను సాధించింది . 

గేమ్ ఛేంజర్ రూ. 400 నుంచి 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 122 కోట్ల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ కాగా వరల్డ్ వైడ్‌గా రూ. 221 కోట్లుగా నమోదైంది. ఈ లెక్కన చూసుకుంటే అంటే వరల్డ్ వైడ్‌గా ఈ  సినిమా రూ. 222 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్, రూ. 425 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి.  ఆలా అయితే బాక్సాఫీస్ పరంగా హిట్ టాక్ తెచ్చుకుంటుంది. లేకుంటే ప్లాప్‌గా మిగిలిపోతుంది.

గేమ్ ఛేంజర్ గురించి

గేమ్ ఛేంజర్‌లో రామ్ రామ్ నందన్ అనే IAS అధికారిగా అప్పన్న అనే పాత్రలో నటించాడు. కియారా  దీపికగా నటించగా, అంజలి  పార్వతి అనే పాత్రలో కనిపించింది.  సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించారు.  పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించగా తమన్ సంగీతాన్ని అందించారు.  

Also Read :  ఢిల్లీని మూసేసిన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు