కాల్చారా.. కాల్చుకున్నాడా.. ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి!

పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగి బస్సీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గన్ షాట్‌కు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయననను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.

New Update
AAP MLA

AAP MLA Photograph: (AAP MLA )

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగి బస్సీ  అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.  పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఆప్ ఎమ్మెల్యేగా గుర్‌ప్రీత్ బస్సి గోబీ ఉన్నారు.  జనవరి 10వ తేదీ శుక్రవారం  అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆయన  గన్ షాట్‌కు గురైయ్యారు. దీంతో  కుటుంబ సభ్యులు ఆయననను  ఆసుపత్రికి తరలించారు. అయితే  మార్గమధ్యలోనే గోగి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనే గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారా? లేక మిస్ ఫైర్ జరిగి చనిపోయారా? అనేది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలుస్తుందని చెప్పారు. 

ఎమ్మెల్యేపై కాల్పులు జరిగినట్లు సమాచారం అందుకున్న కమిషనర్ చాహల్ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేశామని దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడిస్తామని చాహల్ తెలిపారు.  సమాచారం అందుకున్న ఆప్ కార్యకర్తలు, గోగి మద్దతుదారులు ఆసుపత్రికి చేరుకోవడం ప్రారంభించారు. పంజాబ్‌లోని లూథియానా నుంచి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో  గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గోబీ.  రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భరత్ భూషణ్ అషుపై ఈయన విజయం సాధించారు.  

అకాల మరణానికి ముందు

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ రెండో స్థానంలో నిలవగా, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన మహిశేంద్ర సింగ్ గ్రేవాల్ మూడో స్థానంలో నిలిచారు. ఆయన మృతి పట్ల ఆప్ నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. ఇక గోబీ భార్య సుఖ్‌చైన్ కౌర్ గోగి కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఇందర్‌జిత్ సింగ్ ఇందీ చేతిలో ఓడిపోయారు. తన అకాల మరణానికి ముందు, బస్సీ తన నియోజకవర్గ సంక్షేమం గురించి పలువురు మంత్రులను కలిశారు.  లూథియానాలో పంజాబ్ స్పీకర్ , ఎంపీ సంత్ బాబా బల్బీర్ సింగ్ సీచెవాల్‌తో పర్యావరణ సమస్యలను వివరించారు.  గురుప్రీత్ గోగి బస్సీ ఆకస్మిక మరణం లూథియానా పశ్చిమ నియోజకవర్గంలోనే కాకుండా పంజాబ్  రాజకీయ దృశ్యంలో శూన్యతను మిగిల్చిందనే చెప్పాలి.  

Also Read :  మెగా ఫ్యాన్స్కు బిగ్ షాక్‌.. భారీగా తగ్గిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్

Advertisment
తాజా కథనాలు