USA: హమ్మయ్యా తప్పించేసుకున్నారు...ట్రంప్‌ కు బేషరతు విడుదల

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ మొత్తానికి శిక్ష నుంచి తప్పించుకున్నారు. న్యూ యార్క్ కోర్టు ఆయనకు అన్ కండిషనల్ డిశార్జ్‌ను విధించింది. దీని ప్రకారం దోషిగా తేలినప్పటికీ జైలు శిక్ష లేదా జరిమానా ఎదుర్కొనవసరం లేదు. 

New Update
us

Donald Trump

ట్రంప్‌కు పెద్ద తలనొప్పి వదిలింది. ఆయన అధ్యక్షుడు అయ్యేందుకు అడ్డుగా మారిన హష్ మనీ కేసు నుంచి ఆయనకు విముక్తి లభించింది. న్యూయార్క్ కోర్టు జడ్జి ట్రంప్‌కు శిక్ష తప్పదు అని చెప్పారు సుప్రీంకోర్టు కూడా శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఇవ్వలేదు. ట్రంప్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 

అన్‌ కండిషనల్ డిశ్చార్జ్..

కానీ కాలం  మాత్రం ట్రంప్‌కే కలిసి వచ్చింది. ఎన్నికల్లో దిగ్విజయం సాధించారు. ఇప్పుడు అధ్యక్షుడు అయ్యే ముందు శిక్ష నుంచి కూడా తప్పించుకున్నారు. హష్ మనీ కేసులో న్యూ యార్క్ కోర్టు ట్రంప్‌కు అప్‌ కండిషనల్ డిశార్జ్ విధిస్తున్నట్లు ప్రకటించింది.  దీనివలన ఆయన దోషి అయినప్పటికీ ఎలాంటి జైలుశిక్ష, జరిమానా ఎదుర్కోనవసరం లేదు. కానీ దోషిగా నిర్ధారణ అయిన మొదటి అధ్యక్షుడిగా మాత్రం ట్రంప్ నిలవనున్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.  

రాజకీయ కోణం ఉంది..

ఈరోజు న్యూయార్క్ కోర్టు తీర్పుకు ట్రంప్ తన లాయర్‌‌తో కలిసి వర్చువల్‌గా హాజరయ్యారు. తీర్పు ముందు ట్రంప్ మరోసారి తాను నిర్దోషినని వాదించారు. తనకు ప్రజల్లో పాపులారిటీ చాలా ఎక్కువ ఉందని..లక్ష ఓట్లు వచ్చాయని చెప్పారు. ఏడు స్వింగ్ స్టేట్స్‌ను స్వీప్ చేసిన సంగతి గుర్తు చేశారు. తన మీద కావాలనే ఈ కేసులో ఇరికించేందుకు చూశారని ట్రంప్ చెప్పుకున్నారు. ఇందులో రాజకీయ కోణం ఉందని అన్నారు. ట్రంప్ తరుఫు న్యాయవాది సైతం ఇదే వాదించారు. అన్ని విన్న తర్వాత న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్‌ ఎం.మెర్చన్‌ అన్‌కండిషనల్ డిశార్జ్ తీర్పును వెలువరించారు. 

ఇది కూడా చదవండి: TTD: క్షమించండి.. దిగొచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు!

పోర్న్ స్టార్ కు హష్ మనీ ఇచ్చిన కేసులో డొనాల్డ్ ట్రంప్ దోషి అని తేలింది. దీనిపై నమోదైన అభియోగాలను కొట్టేసేందుకు న్యూయార్క్ కోర్టు తిరస్కరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని న్యాయమూర్తి జువాన్‌ మర్చన్‌ స్పష్టంచేశారు. హష్ మనీ లాంటి వ్యవహారాల్లో ట్రంప్‌నకు రక్షణ ఇవ్వలేమని తెలిపారు. అంతకు ముందే ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలింది. గత డాది నవంబర్‌‌లో కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అదే సమయంలో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవడంతో కోర్టు దానిని వాయిదా వేసింది. తరువాత దీనిపై నిన్న సుప్రీంకోర్టు కూడా ట్రంప్ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. తనకు శిక్ష విధిస్తానంటూ న్యూయార్క్‌ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను అడ్డుకోవాలంటూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిని  సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 

Also Read: రాహుల్‌గాంధీకి బిగ్‌ రిలీఫ్.. పరువు నష్టం కేసులో బెయిల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు