/rtv/media/media_files/2025/04/17/D4QOU1Pfv03We8avLd7t.jpg)
11-Year-Old With Speech And Hearing Impairment Raped, Tortured
మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో మరో దారుణం జరిగింది. ఓ 11 ఏళ్ల మూగ, చెవిటి బాలికపై ఓ దుండగుడు అత్యాచారం చేశాడు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. అనంతరం అతడిని పట్టుకొని అరెస్టు చేశారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Also Read: హిందువులపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్..
ఇక వివరాల్లోకి వెళ్తే.. రాంపూర్‌లో ఉంటున్న కుటుంబ సభ్యులు తమ బాలిక కనిపించడం లేదని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఆమె కోసం అన్నీచోట్ల గాలించారు. చివరికీ పొలాల్లో తీవ్ర గాయాలతో నగ్నంగా ఆమె ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే ఆ బాలికను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. చివరికీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా నిందితుడిని గుర్తించారు.
Also Read: కలిసే ఉంటానని..విడిచిపెట్టానని ప్రమాణం చేశా..అందుకే కలిసే..!
దాన్‌సింగ్ (24) అనే వ్యక్తి ఆ బాలికకు మాయమాటలు చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లాడని గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా.. వాళ్లపైనే అతడు కాల్పులకు దిగాడు. ఎదురుకాల్పుల్లో నిందితుడి కాలుకి గాయమయ్యింది. దీంతో చివరికీ అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆ బాలికకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత వైద్యులు కీలక విషయాలను వెల్లడించారు. ఒకరి కంటే ఎక్కువ మంది బాలికపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోందని చెప్పారు. చిన్నారి ముఖంపై, ప్రైవేటు పార్ట్‌పై చాలా గాయాలున్నాయని చెప్పారు. తాను చూసినటువంటి ఘోరమై అత్యాచార ఘటనలో ఇదొకటని చెప్పుకొచ్చారు. ఇక నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: కాబోయే అల్లుడితో అత్త జంప్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. అంతా అత్తే చేసిందన్న అల్లుడు
telugu-news | national-news | rtv-news | rape