/rtv/media/media_files/2025/04/17/ZdsQXGR7oFHupbXuMuoY.jpg)
Big twist in Mother Elopes with Son in law case
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో తన కూతురితో కాబోయే భర్తతో తల్లి పరారైన సంగతి తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను ఇంట్లో నుంచి వెళ్లిపోయేటప్పుడు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లానని తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పింది. తనతో సంబంధం పెట్టుకోకుంటే చనిపోతాని కాబోయే అత్త బెదిరించిందని.. అందుకే తాను ఆమెతో పారిపోయేందుకు ఒప్పుకున్నానని రాహుల్ చెప్పాడు.
ఉత్తరప్రదేశ్‌లోని అలీగర్ జిల్లాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. కూతురికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. వరుడు దొరకడంతో పెళ్లి సంబంధం ఖాయమైపోయింది. ఏప్రిల్ 16న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే కాబోయే పెళ్లి కొడుకు రాహుల్ తరచుగా తన అత్తవారింటికి వచ్చేవాడు. అయితే ఓసారి అతడు తనకు కాబోయే అత్త స్వప్నకు మొబైల్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ తర్వాత వీళ్లద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
Also read: తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న జంటపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
మరో 9 తొమ్మిది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. అంతలోనే ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్లొస్తామని చెప్పి అత్త, అల్లుడు పారిపోయారు. 2.5 లక్షల నగదు, బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు. చివరికి ఆ పారిపోయిన మహిళ భర్త దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక తాజాగా వాళ్లిద్దరూ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. అయితే తన భర్త జితేంద్ర కుమార్ పెద్ద తాగుబోతని స్వప్న చెప్పింది. తనను తాగొచ్చి రోజూ కొడుతుండేవాడని.. తన కూతురుతో కూడా గొడవలు పెట్టుకునేదని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది.
తాను ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లానని భర్త చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పింది. తాను ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడు ఒక మొబైల్ ఫోన్, రూ.200 మాత్రమే ఉన్నట్లు చెప్పింది. మరోవైపు స్వప్త తనను చనిపోతానని బెదిరించడం వల్లే ఆమెతో పారిపోయేందుకు ఒప్పుకున్నానని రాహుల్ చెప్పాడు. తమ కోసం పోలీసులు గాలిస్తున్నారనే విషయాన్ని తెలుసుకుని లొంగిపోయామని చెప్పాడు. మరి ఇప్పుడు స్వప్నని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే తాను చేసుకునేందుకు సిద్ధమేనని చెప్పాడు.
Also Read: ఓసారి కలిసి కూర్చుని మాట్లాడుకోండి.. సీఎం విడాకుల కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
telugu-news | rtv-news | national-news | Uttar Pradesh