Pakistan: హిందువులపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్..

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ జనరల్ అసిమ్‌ మునీర్‌ 'టూ నేషన్ థియరీ' విధానాన్ని సమర్థించారు. భారత్, పాకిస్థాన్ రెండు వేరు వేరు దేశాలని.. హిందువులు ప్రతీ అంశంలో కూడా పాకిస్థాన్‌కు భిన్నంగా ఉంటారని వ్యాఖ్యానించారు.

New Update
 Pakistan army chief Asim Munir

Pakistan army chief Asim Munir

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ జనరల్ అసిమ్‌ మునీర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఓవర్‌సీస్‌ పాకిస్థానీస్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. 'టూ నేషన్ థియరీ' విధానాన్ని సమర్థించారు. భారత్, పాకిస్థాన్ రెండు వేరు వేరు దేశాలని.. హిందువులు ప్రతీ అంశంలో కూడా పాకిస్థాన్‌కు భిన్నంగా ఉంటారని వ్యాఖ్యానించారు.  ప్రతీ పాకిస్థాన్ పౌరుడు కూడా రాబోయే తరాలకు దేశ చరిత్ర గురించి చెప్పాలని సూచించారు. దీనివల్ల వారు పాకిస్థాన్‌ ఎలా ఏర్పడిందనే విషయాన్ని మర్చిపోరని చెప్పారు. 

Also read: కాబోయే అల్లుడితో అత్త జంప్‌ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్‌.. అంతా అత్తే చేసిందన్న అల్లుడు

''  పాకిస్థాన్‌ కథను మీరు మీ పిల్లలకు చెప్పాలి. ఇలా చెబితే వాళ్లు దీన్ని మర్చిపోరు. హిందువులు ప్రతీ అంశంలో కూడా కడా పాకిస్థాన్‌కు భిన్నంగా ఉంటారని మన పెద్దవాళ్లు భావించేవారు. మన మతం, ఆచరాలు, సంప్రదాయాలు భిన్నమైనవి. మన ఆలోచనలు, లక్ష్యాలు కూడా భిన్నమైనవే. టూ నేషన్‌ థియరీకి ఇదే పునాది. ఇండియా, పాకిస్థాన్ ఒకే దేశం కాదు. రెండు వేరువేరే. అందుకే మన పెద్దవాళ్లు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసేందుకు పోరాటం చేశారు. వాళ్లు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. దేశాన్ని ఎలా రక్షించుకోవాలో మనకు తెలుసుని''  అసిమ్‌ మునీర్‌ అన్నారు. 

Also Read :  Kerela state Awardsలో సత్తా చాటిన 'The Goat Life' ఏకంగా తొమ్మిది కేటగిరీల్లో.. ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్

Pakistan's Army Chief General Asim Munir

Also Read:  తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న జంటపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

మరోవైపు అసిమ్‌ మనీర్‌ భారత్, కశ్మీర్‌ వివాదంపై కూడా మాట్లాడారు. పాకిస్థాన్‌ నుంచి కశ్మీర్‌ను ఏ శక్తి కూడా విడదీయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ఐక్యరాజ్య సమితిలో భారత్‌ మరోసారి కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. అంతేకాదు కశ్మీర్‌లో అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల నుంచి పాకిస్థాన్‌ వెళ్లిపోవాలని చెప్పింది. ఇలాంటి తరుణంలో అసిమ్‌ మనీర్‌ భారత్‌, పాకిస్థాన్‌కు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం  సంతరించుకుంది. అంతేకాదు బలోచిస్థాన్‌లో తీవ్రవాదన్ని అంతం చేస్తామని కూడా అసిమ్ మనీర్‌ ప్రతీక్ష చేశారు. రాబోయే పది తరాల వాళ్లు కూడా బలోచిస్థాన్‌, పాకిస్థాన్‌పై దాడులు చేయలేరంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read :  ముగిసిన జుకర్‌ బర్గ్‌ విచారణ!

 telugu-news | rtv-news | international

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు