MLC Kavitha: విచారణకు హాజరు కావాల్సిందే-తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది. కావాలంటే పదిరోజులు సమయం తీసుకోండి కానీ ఈడీ విచారణకు మాత్రం తప్పకుండా రావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.

Kavitha: కవితకు షాక్.. బెయిల్ నిరాకరణ!
New Update

Delhi liquor scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విచారణకు కావాలని నోటీలసులు పంపింది. దాని
ప్రకారం ఈరోజు కవిత విచారణకు హాజరు కావాల్సింది. అయితే దీని మీద ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు చెప్పేవరకు వెళ్ళనని నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ విషయమై కొద్దిసేపటి క్రితమే న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కవిత ఈడీ విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. కావాలంటే మరో 10రోజులు సమయం ఇస్తామని...అంతేకానీ అసలు విచారణకు రాకుండా ఉండడం కుదరదని తేల్చి చెప్పింది.

ఈడీ విచారణను తప్పుబడుతూ ఎమ్మెల్సీ కవిత తరఫు లాయర్ వాదనలు వినిపించారు. కవితకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించొద్దని సూచించారు. కోర్టులో కేసు పెండింగ్‌ లో ఉన్న నేపథ్యంలో విచారణకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం.. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.

#brs #delhi #ed #liquor-scam #mlc-kavitha #kavitha #mlc #supreme-court #delhi-liquor-scam #delhi-liquor-scam-case #investigation #attend
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe