MLC Kavitha: ఇవాళ ఢిల్లీ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ చార్జ్ షీట్పైఇవాళ ట్రయల్ కోర్టులో విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టుకు కవిత, మనీష్ సిసోడియాతో పాటు ఇతర లిక్కర్ కేసు నిందితులు హాజరుకానున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ చార్జ్ షీట్పైఇవాళ ట్రయల్ కోర్టులో విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టుకు కవిత, మనీష్ సిసోడియాతో పాటు ఇతర లిక్కర్ కేసు నిందితులు హాజరుకానున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీర్ఎస్ కార్యకర్తలు కవితకు ఘనస్వాగతం పలికారు. పెద్ద ఎత్తున జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీతో బంజారాహిల్స్ లోని తమ నివాసానికి బయలుదేరారు కవిత.
లిక్కర్ కేసులో బెయిల్‌పై విడుదలైన కవితపై ఈడీ పలుమార్లు చార్జిషీటు దాఖలు చేసింది. ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవితకు 32 శాతం వాటా ఉన్నట్లు అభియోగాలు మోపింది. అలాగే గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అయ్యే ఖర్చును ఆమె హ్యాండిల్ చేశారంటూ మరో ఛార్జిషీటులో వెల్లడించింది.
TG: ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుండడంతో కవిత బయటకు వచ్చిందని ఆరోపించారు. ఈ కేసులో అరెస్టైన కేజ్రీవాల్, సిసోడియాకు చాలా కాలం బెయిల్ రాకపోవడమే ఇందుకు నిదర్శనం అని అన్నారు.
ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కవితకు ఈ రోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయమే గెలిచిందంటూ వ్యాఖ్యానించారు.
సుప్రీం కోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించింది. అయితే, 10 లక్షల రూపాయల రెండు పూచీకత్తులతో పాటు, పాస్ పోర్ట్ సమర్పించాలని కోర్టు చెప్పింది. సాక్షులను ప్రభావితం చేయడం, తారుమారు చేయడం చేయకూడదని సుప్రీం కోర్టు షరతులు విధించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. దీంతో మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై చర్చ నడుస్తోంది. ఇంతకీ అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఇందులో కవిత పాత్ర ఉందా? ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు? తదితర పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో 161 రోజుల తర్వాత ఆమె జైలు నుంచి విడుదల కానున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు, కుటుంబ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.