Women Health: 30 ఏళ్ల తర్వాత రొమ్ము పరిమాణాన్ని పెంచడం సాధ్యమేనా?

30 ఏళ్ల మహిళల్లో ఛాతీ విస్తరణ పెరగాలంటే వ్యాయామాలు చేయాలి. ఇవి ఛాతీ కండరాలను బలోపేతం చేస్తాయి. రొమ్ము పరిమాణం సహజంగా పెరగాలంటే కొబ్బరి నూనెతో మసాజ్, సోయాబీన్స్, అవిసెగింజలు, బాదం, వాల్‌నట్, ఫైటోఈస్ట్రోజెన్లు ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

New Update

Women Health: 30 ఏళ్ల వయస్సు తర్వాత రొమ్ము పరిమాణాన్ని సహజంగా పెంచుకోవాలనుకునే మహిళలు చాలా మంది ఉంటారు. ఈ దశలో శరీరంలో హార్మోన్ల స్థాయిలు స్థిరపడటం వల్ల రొమ్ముల అభివృద్ధి ముందు తరహాలో జరగక పోవచ్చు. అయినప్పటికీ కొంత మేర సహజ మార్గాలలో మార్పులు చేసి రొమ్ము పరిమాణాన్ని ప్రభావితం చేయడం సాధ్యమే. ఛాతీ విస్తరణ వ్యాయామాలు, డంబెల్ ప్రెస్ లాంటి వ్యాయామాలు ఛాతీ కండరాలను బలోపేతం చేస్తాయి.

కొబ్బరి నూనెతో రోజూ మసాజ్..

వీటివల్ల రొమ్ములు గట్టి రూపాన్ని పొందుతూ చిన్నదిగా కనిపించే రొమ్ములు పెద్దవిగా కనపడేలా చేస్తాయి. వీటిని సాధారణంగా రోజు 15-20 నిమిషాలు చేయడం వల్ల నెమ్మదిగా మార్పు కనపడవచ్చు. అంతేకాదు కొబ్బరి నూనెతో రోజూ మసాజ్ చేయడం రక్త ప్రసరణను మెరుగుపరుచి ఛాతీ కణజాలాన్ని మృదువుగా ఉంచుతుంది. ఆహారం విషయానికొస్తే ఫైటోఈస్ట్రోజెన్లు కలిగిన ఆహారం తీసుకోవడం మేలు చేస్తుంది. ఇవి ఎస్ట్రోజెన్ అనే స్త్రీ హార్మోన్‌ను అనుకరించగల గుణాలు కలిగి ఉంటాయి. 

ఇది కూడా చదవండి: డయాబెటిస్ ఉన్నవారు చెరకు రసం తాగవచ్చా? అది సురక్షితమో కాదో తెలుసుకోండి

సోయాబీన్స్, అవిసె గింజలు, బాదం, వాల్‌నట్, సాల్మన్ చేపలు వంటి వాటిలో ఇవి అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు అందిస్తూ రొమ్ముల ఎదుగుదలలో సహాయపడతాయి. నీళ్లు ఎక్కువగా తాగడం కూడా శరీర హైడ్రేషన్‌ను మెరుగుపరుస్తుంది. ఇది చర్మాన్ని, కణజాలాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. 30 ఏళ్ల తర్వాత సహజంగా రొమ్ము పరిమాణాన్ని పెద్దగా మార్చలేనప్పటికీ వ్యాయామం, మసాజ్, ఆహార నియమాల ద్వారా ఆకారం, ప్రాకృతికంగా వాటిని మెరుగుపరచవచ్చు. ఇది స్థిరమైన ప్రయత్నంతో సాధ్యమవుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: గంధం రాసుకుంటే కలిగే ప్రయోజనాలు

( women-health | women-health-tips | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు