Sugarcane Juice: డయాబెటిస్ ఉన్నవారు చెరకు రసం తాగవచ్చా? అది సురక్షితమో కాదో తెలుసుకోండి

వేసవికాలంలో చెరకు రసం తాగడం చాలా మంచిది. చెరకు రసంలో సుక్రోజ్ రక్తంలో చక్కెర వేగంగా పెరగడానికి, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తికి ప్రయోజనకరంగా చెబుతారు. డయాబెటిక్ రోగులు దీనిని జాగ్రత్తగా తీసుకోవాలి లేదా అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

New Update
Sugarcane Juice

Sugarcane Juice

Sugarcane Juice: చెరకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వేసవి కాలంలో మార్కెట్లో చెరకు రసం అమ్మకాలు అధికంగా ఉంటాయి. మండే ఎండలో, చల్లని చెరకు రసం శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవి కాలంలో చెరకు రసం తాగడం చాలా మంచిది. అదనంగా ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. కానీ డయాబెటిక్ రోగులు చెరకు రసం తాగడం సురక్షితమేనా? కాదా అని చాలామందిలో అనుమానులు ఉంటాయి. ఈ డౌట్‌పై కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా..

చెరకు రసంలో  కేలరీలు - 180 కిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు - 44-50 గ్రాములు, సహజ చక్కెరలు, ప్రోటీన్ - 0.1 గ్రాము, కొవ్వు - 0 గ్రాములు, ఫైబర్ - 0 గ్రాములు, కాల్షియం - 30-40, మెగ్నీషియం - 25, పొటాషియం- 270300,ఇనుము - 0.5 నుండి 1 మిల్లి గ్రాములు ఉంటాయి.  చెరకు చాలా పోషకాలతో నిండి ఉన్నప్పటికీ.. వేసవిలో చక్కెర శాతం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారికి ఇది హానికరం. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లాగానే.. చెరకులో కూడా సుక్రోజ్ ఉంటుంది. ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: కొబ్బరి తింటారా..? కొవ్వు కంట్రోల్‌లో ఉంటుందా?

చెరకు రసం వంటి చక్కెర అధికంగా ఉండే పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది మధుమేహంతో బాధపడేవారికి సమస్యలను కలిగిస్తుంది. చెరకు రసంలో సుక్రోజ్ అధికంగా ఉండటం వల్ల దానికి అధిక జీఐ సూచిక ఉండే అవకాశం ఉంది. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగడానికి కారణమవుతుంది. చెరకు రసం జీర్ణక్రియ, రోగనిరోధక శక్తికి ప్రయోజనకరంగా చెబుతారు. డయాబెటిక్ రోగులు దీనిని జాగ్రత్తగా తీసుకోవాలి లేదా అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
 
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ కంటే ప్రమాదకరం

( sugarcane-juice | sugarcane-juice-benefits | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
తాజా కథనాలు