Sandalwood: గంధం రాసుకుంటే కలిగే ప్రయోజనాలు

గంధంలో ఉండే శీతలకర లక్షణాలు, దాని సహజ వాసన, యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి, మనస్సుకు ఉపశమనం ఇస్తాయి. వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కోసం నుదుటిపై గంధపు పేస్ట్‌ను రాయడం వలన ఉష్ణతాపం తగ్గి శరీరం చల్లబడుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Sandalwood

Sandalwood

Sandalwood: గంధపు చెక్కను మన భారతీయ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకంగా పరిగణిస్తారు. దైవ పూజలలో, శరీర శుద్ధిలో, మానసిక స్థిరతలో దీనికి ఉండే ప్రాధాన్యతను మన పూర్వీకులు బాగా తెలుసుకుని దాన్ని అనుసరించేవారు. ముఖ్యంగా శివలింగానికి గంధపు అభిషేకం చేయడం లేదా దేవతలకు గంధాన్ని అలంకారంగా ఉపయోగించడం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసే చర్యగా భావించవచ్చు. గంధంలో ఉండే శీతలకర లక్షణాలు, దాని సహజ వాసన, యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఇవన్నీ మన శరీరానికి, మనస్సుకు ఉపశమనం ఇస్తాయి. 

నుదుటిపై గంధపు పేస్ట్‌:

వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కోసం నుదుటిపై గంధపు పేస్ట్‌ను రాయడం వలన ఉష్ణతాపం తగ్గి శరీరం చల్లబడుతుంది. ఇది కడుపులో వేడి కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గించగలదు. గంధపు వాసన నాడీ వ్యవస్థపై శాంతియుత ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మనిషికి మంచి నిద్ర రావడం, మానసిక ఒత్తిడి తగ్గడం జరుగుతుంది. ఈ వాసన మెదడులోని ఆందోళన హార్మోన్లను తగ్గించడంతో పాటు శాంతిని అందిస్తుంది. కనుబొమ్మల మధ్య గంధాన్ని రాయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: డయాబెటిస్ ఉన్నవారు ORS తాగవచ్చా..?

ఎందుకంటే ఇది ఆజ్ఞా చక్రం స్థితిలో ఉంటూ మానసిక స్పష్టతను అందిస్తుంది. అలాగే మొటిమలు, చర్మ సమస్యల నివారణకూ గంధపు ముద్ద ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని శుభ్రంగా ఉంచి దాని ప్రకాశాన్ని పెంచుతాయి. ఆధునిక జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనిదినచర్య మధ్య  గంధపు ముద్దను నుదిటిపై రాయడం ఒక సహజ చికిత్సగా పనిచేస్తుంది. తక్కువ ఖర్చుతో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా గంధం వాడుకోవచ్చు. ఇది శరీరానికి, మనసుకు తిరిగి శక్తిని ఇస్తుందని నిపుణులు అంటున్నారు.
 
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అరటితో పాటు ఫ్రిజ్‌లో పెట్టగానే విషంగా మారే 5 పండ్లు ఇవే!

( red-sandalwood | sandalwood-powder | sandalwood-powder-benefits | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు