Walking: రోజూ గంట నడిస్తే ఎన్ని కిలోల బరువు తగ్గవచ్చు?

రోజులో గంట నడిస్తే శరీరం కేలరీలు ఖర్చు చేస్తుంది. నడక, ఆహారం, హైడ్రేషన్ సరిగ్గా ఉన్నపుడు బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది. వారానికి ఐదు రోజులు నడిస్తే అది శరీరంలోని కొవ్వును తక్కువ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update

Walking: నేటికాలంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనికి  ప్రధాన కారణం శారీరక వ్యాయామం లేకపోవటం అని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ నడకను అలవాటుగా మార్చుకుంటే అది ఆరోగ్యానికి మంచి ఫలితాలను ఇస్తుంది. రోజులో గంటసేపు నడవడం ద్వారా శరీరం భారీగా కేలరీలు ఖర్చు చేస్తుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక నెల పాటు రోజూ గంటసేపు లేదా వారానికి కనీసం ఐదు రోజులు నడిస్తే అది శరీరంలోని కొవ్వును తక్కువ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. నడక వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం

బరువు తగ్గుతారు:

సాధారణ వేగంతో నడవడం వల్ల సుమారు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం కవర్ చేయవచ్చు. వేగంగా నడవడం లేదా జాగింగ్ చేస్తే ఆ దూరం ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల వరకు పెరగవచ్చు. ఈ ప్రక్రియలో రోజుకు సుమారు 200 నుండి 300 కేలరీలు ఖర్చవుతాయి. ఇది నెలల వ్యవధిలో బరువును మూడు నుంచి నాలుగు కిలోల వరకు తగ్గించగలదు. అంతేకాకుండా ప్రతిరోజూ 10 వేల అడుగులు నడిస్తే రెండు నుంచి మూడు కిలోల వరకూ బరువు తగ్గవచ్చు. అయితే ఇది పూర్తిగా శరీర చర్మం, జీవనశైలి, ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.

ఇది కూడా చదవండి: టాబ్లెట్‌ వేసుకున్నా జ్వరం తగ్గకపోతే ఈ టెస్టులు చేయించుకోండి

నడకతో పాటు ఆరోగ్యకరమైన, తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అధిక కొవ్వులు, చక్కెరలతో కూడిన పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. తగినంత నీరు తాగడం కూడా శరీర డీటాక్స్‌కు సహాయపడుతుంది. ఇలా నడక, ఆహారం, హైడ్రేషన్ సరిగ్గా ఉన్నపుడు బరువు తగ్గే ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. కనీసం రోజుకు 45 నిమిషాల నడకను నిరంతరం కొనసాగిస్తే అది శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడమే కాకుండా బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తింటున్నారా.. జాగ్రత్త

( benefits-of-walking | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు