Chicken: వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తింటున్నారా.. జాగ్రత్త

మాంసం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. వారానికి 300 గ్రాముల చికెన్ తింటే మరణ ప్రమాదం 27 శాతం పెరుగుతుంది. చికెన్ చెడు కొలెస్ట్రాల్‌ కలిగిన ఆహారం. దీనివల్ల రొమ్ము, ప్రోస్టేట్, పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలలో తేలింది.

New Update

Chicken: మాంసం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. కానీ అన్ని రకాల మాంసం ఒకేలా ఉండదు. ముఖ్యంగా సముద్ర ఆహారంలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అమృతం ఎక్కువగా తీసుకుంటే అది విషంగా మారుతుందని, మాంసాహారం తీసుకోవడంలో కూడా పరిమితులు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చికెన్‌ మంచి ప్రొటీన్‌కు మూలం అయినా తక్కువగా తీసుకోవడం మంచిది. చికెన్ అంటే చెడు కొలెస్ట్రాల్ లేదా కొవ్వు లేని ప్రోటీన్ కలిగిన ఆహారం. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల రొమ్ము, ప్రోస్టేట్, పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని కొన్ని పరిశోధనలలో తేలింది. 

కొన్ని క్యాన్సర్లు వచ్చే ప్రమాదం:

అమెరికాలో 19 సంవత్సరాల పాటు జరిగిన పరిశోధనలో 4 వేల మందిపై అధ్యయనం చేశారు. ఇందులో వారానికి 300 గ్రాముల చికెన్ తినడం వల్ల మరణ ప్రమాదం 27 శాతం పెరుగుతుందని తేలింది. కానీ 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినేవారు మరింత ప్రమాదంలో ఉన్నారని అంటున్నారు. జీర్ణశయాంతర క్యాన్సర్ వచ్చే ప్రమాదం పురుషుల్లో ఎక్కువగా ఉంటుందని, కానీ నేటి యువత ఎక్కువగా చికెన్‌ అంటున్నారని నిపుణులు అంటున్నారు. ఇందులోని విటమిన్ బి-12, కోలిన్ మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. రెడ్‌ మీట్‌, ప్రాసెస్ చేసిన మాంసం గురించి ఇప్పటికే జనాల్లో ఒక ఆందోళన ఉంది. ఈ మాంసాలను ఎక్కువగా తీసుకోవడం వలన గుండెపోటు, స్ట్రోక్, డయాబెటిస్, కొన్ని క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. 

ఇది కూడా చదవండి: కడుపులో నులిపురుగులు పోవాలా.. లవంగంతో ఇలా చేయండి

అయితే తాజా పరిశోధన ప్రకారం చికెన్‌ కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం అని నిపుణులు అంటున్నారు. ఇక వారానికి 100 గ్రాముల చికెన్ తినడం సురక్షితమని, కానీ 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. చికెన్‌కు బదులుగా చేపలు తీసుకోవడం ఒక మంచి ఆప్షన్. చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. ఈ సముద్ర ఆహారాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడా ఉంటాయి, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: టాబ్లెట్‌ వేసుకున్నా జ్వరం తగ్గకపోతే ఈ టెస్టులు చేయించుకోండి


( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు