/rtv/media/media_files/2025/06/03/i7AGcDnq7YEl9o61DJ0K.jpg)
బాల్యంలో సైకిల్ తొక్కిన సందర్భాలు మనకు మదుర జ్ఞాపకం. సైకిల్‌తో మెమోరిస్ లేనివారంటూ ఉండరు. కానీ ప్రస్తుతం సైకిల్ అంటే చిన్న చూపు. ఎందుకంటే అవి బైక్‌లా రైయ్.. రైయ్ అని సౌండ్ చేయవు. అంతేకాదు సైకిల్ తొక్కడం కష్టమైన పని. మనిషి సుఖానికి అలవాటు పడటంతో సైకిల్‌కు ఉన్న ఆదరణ తగ్గింది. ఒకప్పుడు పాత సినిమాల్లో ఛేసింగ్ సీన్లు సైకిళ్లపైనే ఉండేవి. కానీ ఇప్పుడు సైకిల్‌కి ఉన్న క్రేజ్ కిల్ అయ్యింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. ప్రతి సంవత్సరం జూన్ 3 (ఈరోజు)న వరల్డ్ సైకిల్ డే జరుపుకుంటారు. దీన్ని తుర్క్‌మెనిస్తాన్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ లెస్జెక్ సిబిల్స్కి ప్రతిపాదించారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2018 ఏప్రిల్‌లో అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి వరల్డ్ సైకిల్ డేగా నిర్వహిస్తారు. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సైకిల్‌తో మీకున్న జ్ఞాపకాలు నెమరేసుకోండి. SHARE >>
Also Read : 59 కేజీల బంగారం చోరి.. బ్యాంకుకు బొక్కెట్టిన దొంగలు
Happy World Bicycle Day!
— Ghideon Musa (@GhideonMusa) June 2, 2025
Celebrated on June 3rd, this day promotes bicycles as an eco-friendly mode of transport, enhancing health and community well-being. In #Eritrea, cycling is a popular and sustainable way to get around. pic.twitter.com/hCPx4gMKNC
Also Read : యువతి ప్రైవేట్ పార్ట్స్‌పై స్క్రూ డ్రైవర్‌తో పొడిచి దారుణ హత్య
సైకిల్ ఆరోగ్యం.. ఎకో ఫ్రెండ్లీ
आज #WorldBicycleDay पर शपथ लें, मोदी जी के ‘Fit India, Healthy India, Obesity Free India’ बनाने की।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) June 3, 2025
आइए साइकिलिंग को अपने जीवन में अपनाएँ। pic.twitter.com/7tOYGbrtYv
Also Read : సీజ్ ఫైర్‌కి అంగీకరించని రష్యా.. ఉక్రెయిన్‌పై పగతో రగిలిపోతున్న పుతిన్
సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మంచిది. పిక్క కండరాలు, కాళ్ల ఎముకలకు సైకిలింగ్ మంచి ఎక్స్‌ర్‌సైజ్. సైకిల్ తొక్కుతున్నప్పుడు మనకు తెలియకుండానే శ్వాసక్రియ బాగా పని చేస్తోంది. సైకిల్ వల్ల పొల్యూషన్ కూడా ఉండదు. బైక్, కారు వాడకుండా సైకిల్‌పై తిరిగితే మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్లం అవుతాము. సైకిల్ తొక్కడం ఓ గేమ్ కూడా. ఇప్పటికీ ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో సైకిళ్ళు కొందరికి జీవనాధారాలు. బైక్, కారు అయితే ట్రబుల్ ఇవ్వొచ్చు. అదే సైకిల్ అయితే ఆ అవకాశం తక్కువ. సో.. కిరాణ షాప్, మార్కెట్, కొద్దిపాటి దూరానికి సైకిల్ పై రైడ్ చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం.. పెట్రోల్ డబ్బు కూడా ఆదా.
Also Read : 2025 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. పూర్తి వివరాలివే!
world-bicycle-day | united-nations | telugu viral news | latest-telugu-news | best-health-tips | best exercise | best workout for healthy