/rtv/media/media_files/2025/06/03/It5F6QJfyO6Gb2t63Eag.jpg)
యువతి దారుణ హత్య సోమవారం వెలుగులోకి వచ్చింది. ప్రేమిస్తున్నా అంటూ వెంటపడిన వ్యక్తి యువతిని దారుణంగా మర్డర్ చేశాడు. శనివారం పశువులకు మేత తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ మరుసటిరోజు శవమై కనిపించింది. ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన వ్యక్తే సైరా అనే యువతిని స్క్రూడ్రైవర్‌తో 18 సార్లు పొడిచి.. చిత్రహింసలకు గురిచేసి దారుణంగా హత్య చేశాడు. బాధితురాలి ఫోన్ కాల్ డేటాతో నిందితుడు పట్టుబడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ మొరాదాబాద్‌లోని కొట్వాలి మైనథర్ గ్రామంలో వెలుగుచూసింది.
Also Read : ఇది తెలిస్తే.. ఈరోజే వెళ్లి సైకిల్ కొంటారు!
Man Murder With Screwdriver
मुरादाबाद : मोहम्मद रफी ने पड़ोस की लड़की के साथ दुष्कर्म करके उसके प्राइवेट पार्ट पर दरांती से 45 वार करके हत्या कर दिया।
— सनातनी दीपक 🚩 (@Biharwale04) June 2, 2025
ये कलयुगी राक्षस हैं।🤬😡😡😡😡 pic.twitter.com/6ycSFaEhdX
Also Read : హఫీజ్ సయీద్ కొడుకుతో పాకిస్తాన్ స్పీకర్.. ఉగ్రవాదులతో లింకుల విషయంలో మరో సాక్ష్యం
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మహిళ ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు ఉండటంతో అత్యాచారం జరిగిందేమోనని పోలీసులు అనుమానించారు. పోస్టు మార్టం రిపోర్ట్, నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శవపరీక్షలో అత్యాచారం జరగలేదని తేలింది. సైరా మొబైల్ ఫోన్‌లో ఐదు మిస్డ్ కాల్స్‌ని గుర్తించి.. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన రఫీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు తన కుమార్తెను వేధించేవాడని సైరా తల్లి సఫీనా పోలీసులకు చెప్పడంతో అతడిని కస్టడీలోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది. తానే సైరాను హత్య చేసినట్లు రఫీ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : అసలైన ఇసైజ్ఞాని..లయరాజు ఇళయరాజా బర్త్ డే స్పెషల్
సైరాని ప్రేమిస్తున్నట్లు రఫీ చెప్పినా ఆమె అతడిని దూరం పెట్టింది. కొన్ని రోజుల క్రితం రఫీని మరో వ్యక్తి కొట్టాడు. దీంతో తనను కొట్టిన వ్యక్తితో సైరా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు అనుమానించిన రఫీ.. ఆ తర్వాత 2 రోజుల పాటు ఆమె వెంటపడ్డాడు. ఈ క్రమంలోనే శనివారం సైరాను అనుసరించి పొలంలోకి వెళ్లి స్క్రూడ్రైవర్‌తో 18 సార్లు ఆమెపై దాడి చేశాడు. సైరాని అతికిరాతకంగా చంపి నిందితుడు ఇంటికి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని నిద్రపోయాడు.
Also Read : 59 కేజీల బంగారం చోరి.. బ్యాంకుకు బొక్కెట్టిన దొంగలు
screwdriver | private parts | lover | uttarapradesh | telugu crime news | latest-telugu-news | saira | md rafi | man murder with screwdriver