/rtv/media/media_files/2025/06/02/AVuONDzEIbMeVh6uB1cz.jpg)
రష్యా - ఉక్రెయిన్ మధ్య సోమవారం శాంతి చర్చలు ముగిశాయి. రష్యా అధ్యక్షుడు కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఉక్రెయిన్‌పై పుతిన్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. ఇస్తాంబుల్‌లో రెండు దేశాల ప్రతినిధుల సమావేశం అయ్యారు. గంటకుపైగా శాంతి చర్చలు కొనసాగాయి. ఉక్రెయిన్ పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ కోరింది.
🇺🇦🇷🇺🇹🇷 #BREAKING: The negotiations between Russia and Ukraine in Istanbul lasted only a little more than an hour.
— Global War Report. (@GlobeWarReport) June 2, 2025
➡️ Axios, citing a Ukrainian source, reports that Russia gave Ukraine its "Peace Memo" with terms for a ceasefire and conditions for ending the war. pic.twitter.com/XYHD4xOI3k
షరతులు లేకుండా కాల్పుల విరమణకు నో చెప్పింది రష్యా. అమెరికా పర్యవేక్షణలో సీజ్ ఫైర్ అమలు చేయాలని ఉక్రెయిన్ అభ్యర్థించింది. 6వేల మంది సైనికుల మృతదేహాలను ఉక్రెయిన్‌కు అప్పగించాలని రష్యా నిర్ణయించుకుంది. దీనికి బదులుగా యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఖైదీల మార్పిడికి ఇరుదేశాలు అంగీకరించాయి. నిర్దేశిత ప్రాంతాల్లో 2-3 రోజుల పాటు కాల్పుల విరమణ అమలు చేయాలని రష్యా ప్రతిపాదించింది. జూన్ నెలలోనే రెండు దేశాలు మరోసారి సమావేశం కానున్నాయి.
putin | Ukraine-Russia peace talks | ceasefire | refuses | russia drone attack on ukraine | russian ukraine war | russia ukraine conflict | russia ukraine attack | russia ukraine meeting | latest-telugu-news