Heart Attack Sign
Heart Attack Sign: శరీరం అనేది అనేక వ్యవస్థల సమ్మేళనం. ఇందులో ప్రతి భాగం ఒకదానితో అనుసంధానంగా పనిచేస్తుంది. అందుకే శరీరంలో ఏదైనా భాగంలో చిన్న మార్పు జరిగినా అది ఇతర భాగాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు. హార్ట్ బ్లాకేజ్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. మొదటి నుండి శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంటుంది. ఈ సంకేతాలు ముందస్తుగా గుర్తిస్తే తీవ్ర గుండెపోటును నివారించవచ్చు. ఇటీవల చిన్న వయస్సులోనే గుండెపోటు వచ్చే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక లక్షణాలను గుర్తించడం అత్యంత అవసరం. గుండెపోటుకు ముందు శరీరం, ముఖ్యంగా కాళ్ళలో కొన్ని ప్రత్యేక లక్షణాలను చూపిస్తుంది.
పాదాల్లో వాపు కనిపిస్తే..
మొదటగా కాళ్లలో నొప్పి అనేది ప్రధాన సంకేతం. ఇది రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. నడుస్తున్నప్పుడు ఈ నొప్పి పెరగడం, విశ్రాంతి తీసుకున్నప్పుడే తగ్గడం గుండె ధమనులలో రక్తప్రసరణ సరిగా లేకపోవటానికి సంకేతంగా పరిగణించవచ్చు. రెండవది తిమ్మిరి, చలిగా అనిపించడం. ఇది రక్త సరఫరా తక్కువగా ఉండటంతో కాళ్ళకు కావలసిన ఆక్సిజన్, పోషకాలు అందకపోవడం వల్ల జరుగుతుంది. తరచూ చల్లగా ఉండే పాదాలు, తిమ్మిరి అనుభవం గుండె సమస్యలకు సంకేతంగా ఉండొచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన లక్షణం వాపు. కాళ్ళు లేదా పాదాల్లో వాపు కనిపిస్తే అది రక్తప్రసరణలో ఆటంకాన్ని సూచిస్తుంది. శరీరంలో ద్రవం పేరుకుపోవడం వల్ల వాపు వస్తుంది.
ఇది కూడా చదవండి: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!
ఇది ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా కనిపిస్తుంది. అదే విధంగా కాళ్ళ చర్మం రంగులో మార్పులు కూడా గుండె బలహీనతకు సంకేతం. చర్మం నీలం లేదా ఊదా రంగులోకి మారడం, మెరుస్తూ కనిపించడమూ ఆక్సిజన్ అందకపోవటానికి సూచన. చివరిగా కాళ్ళపై నయం కాని గాయాలు ఉంటే అది తీవ్రమైన రక్త ప్రసరణ లోపానికి సంకేతం. ఇలాంటి గాయాలు ఎక్కువసేపు ఉంటూ మంట లేదా పూత వస్తుంటే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. ఈ లక్షణాలను పట్టించుకోకపోతే అవి హార్ట్ అటాక్‌కు దారి తీయొచ్చు. శరీరం మనకు ముందుగానే సంకేతాలు ఇస్తుందన్న విషయాన్ని గుర్తించాలి. కాళ్లలో ఉన్న చిన్న అసౌకర్యాన్ని కూడా పట్టించుకుని, అకాల ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముందస్తు జాగ్రత్తలు కీలకం.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రోజంతా ACలో గడిపితే ఊబకాయం వచ్చే ప్రమాదం
( heart-attack | heart-attack-risk | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)