/rtv/media/media_files/2025/03/29/JONV6VhxWN2aIHCS9EKq.jpg)
kdapa Road Accident
AP Crime: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని అనంతరాజంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. అతివేగం కారణంగా లారీ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు, వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
Also Read : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో..
ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో మిగతా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్టు అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: కడుపులో నులిపురుగులు పోవాలా.. లవంగంతో ఇలా చేయండి
ఈ ఘటనను చూసిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన కొంతమంది స్థానికులు గాయపడిన వారిని రక్షించేందుకు ప్రయత్నించారు కానీ అప్పటికే ఇద్దరూ మరణించినట్టు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసం కాగా.. లారీ ముందు భాగం కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అనంతరం మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు అధికారులు. డ్రైవింగ్ చేసేవారు.. రహదారి నియమాలు పాటించాలని, వేగం అదుపులో ఉంచాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఉదయం ఈ తప్పులు చేస్తే థైరాయిడ్ మందులు వేసుకున్నా లాభం ఉండదు
Also Read : ఉగ్రదాడి నిందితులపై సైన్యం కాల్పుల వర్షం
( AP Crime | ap crime updates | ap-crime-news | ap-crime-report | latest-news | telugu-news )