/rtv/media/media_files/2025/12/25/cancer-risk-2025-12-25-13-12-50.jpg)
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు, కానీ తాజాగా వచ్చిన ఓ అధ్యయనంలో షాకింగ్ నిజాలను వెల్లడించింది. కేవలం అతిగా తాగే వారికే కాకుండా, తక్కువ మొత్తంలో మద్యం సేవించే వారికి కూడా నోటి క్యాన్సర్(cancer cases in india) వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రోజుకు ఒకటి లేదా 2 పెగ్‌లు తాగడం వల్ల పెద్దగా నష్టం ఉండదని చాలామంది భావిస్తుంటారు. అయితే, 'జామా నెట్‌వర్క్ ఓపెన్' అనే అంతర్జాతీయ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఈ నమ్మకాన్ని పటాపంచలు చేసింది. కొద్దిపాటి మద్యపానం కూడా శరీరంలోని కణజాలంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
Also Read : డ్రెస్ కోడ్ వెనుక సీక్రెట్ ఇదే.. కోకాకోలా యాడ్‌తో తాత ఫేమస్
అధ్యయనంలోని ముఖ్యాంశాలు:
రోజుకు 10 గ్రాముల కంటే తక్కువ ఆల్కహాల్ తీసుకునే వారిలో కూడా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం తాగని వారితో పోలిస్తే గణనీయంగా ఎక్కువగా ఉందని తేలింది. ఆల్కహాల్ నోట్లోకి వెళ్లగానే అది 'ఎసిటాల్డిహైడ్' అనే విషపదార్థంగా మారుతుంది. ఇది కణాలలోని DNAను దెబ్బతీస్తుంది, దీనివల్ల క్యాన్సర్ కారక కణాలు వృద్ధి చెందుతాయి. ఎవరైతే మద్యంతో పాటు ధూమపానం కూడా చేస్తారో, వారికి నోటి, గొంతు క్యాన్సర్లు వచ్చే ముప్పు 30 రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
లక్షణాలు ఎలా ఉంటాయి?
నోటి క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. మద్యం సేవించే వారు ఈ క్రింది లక్షణాలపై నిఘా ఉంచాలి. - cancer-cases
- నోటిలో తగ్గని పుండ్లు లేదా తెల్లటి మచ్చలు.
- నమలడం లేదా మింగడంలో ఇబ్బంది కలగడం.
- గొంతులో గడ్డలాగా అనిపించడం లేదా గొంతు బొంగురుపోవడం.
- దవడలు లేదా నాలుక కదలికలో నొప్పి.
వైద్యుల సూచనలు:
వెదర్, లైఫ్‌స్టైల్ మార్పులతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న తరుణంలో "సురక్షితమైన మద్యపానం" అంటూ ఏదీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవాలంటే మద్యానికి పూర్తిగా దూరంగా ఉండటమే ఉత్తమ మార్గమని వారు సూచిస్తున్నారు. ఈ అధ్యయనం సామాజికంగా మద్యం సేవించే వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఆహారపు అలవాట్లతో పాటు వ్యసనాలకు దూరంగా ఉండటం అత్యవసరమని ఈ పరిశోధన మరోసారి గుర్తుచేసింది. - national news in Telugu
Also Read : ప్రతి నిమిషానికి 194 బిర్యానీలు ఆర్డర్.. స్విగ్గీ షాకింగ్ రిపోర్ట్
Follow Us