/rtv/media/media_files/2025/12/24/santa-claus-getup-from-coca-cola-advertisement-2025-12-24-11-16-55.jpg)
క్రిస్మస్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది తెల్లని గడ్డం, ఎర్రటి డ్రస్సులో నవ్వుతూ కనిపించే శాంటా క్లాజ్. శాంటా తాతా వస్తాడే గిఫ్ట్‌లు ఇచ్చి పోతాడే అని అంటుంటారు. అయితే, శాంటా ఎప్పుడూ రెడ్ కలర్ డ్రెస్ ధరిస్తారా? దీని వెనుక ఉన్న సీక్రెట్ తెలుసా? శాంటాకు ఈ ఎరుపు రంగు కూల్ డ్రింక్ కంపెనీ కోకాకోలా ఇచ్చిందని చాలామందికి తెలియదు. హిస్టరీ తిరగేస్తే షాకింగ్ విషయాలు బయటపడతాయి. 1931లో కోకాకోలా కంపెనీ యాడ్ కోసం శాంటా క్లాజ్‌ను రెడ్ కలర్ కోట్‌లో చూపించింది. అప్పుడు ఆ యాడ్ బాగా జనాల్లోకి వెళ్లింది. దీంతో శాంటా తాతకు ఆ గెట్‌అప్ ఫిక్స్ అయ్యింది.
Coca-Cola spends $5B a year on advertising.
— Trung Phan (@TrungTPhan) November 16, 2024
It invented the modern-day image of Santa Claus.
And just completely mailed it in with this 15 second AI-generated Christmas ad:
pic.twitter.com/zOKK7Tt3Vx
సెయింట్ నికోలస్: శాంటా క్లాజ్ మూలాలు 4వ శతాబ్దానికి చెందిన 'సెయింట్ నికోలస్' లో ఉన్నాయి. ఆయన ఓ క్రైస్తవ మతగురువు. ఆ కాలంలో బిషప్‌లు సాంప్రదాయకంగా ఎరుపు, తెలుపు రంగు వస్త్రాలను ధరించేవారు. ఇదే శాంటా ఎరుపు రంగుకు పునాది అని చరిత్రకారులు చెబుతారు.
థామస్ నాస్ట్ చిత్రాలు: 1860వ దశకంలో ప్రఖ్యాత కార్టూనిస్ట్ థామస్ నాస్ట్, 'హార్పర్స్ వీక్లీ' కోసం శాంటా చిత్రాలను గీశారు. మొదట్లో ట్యాన్ రంగులో ఉన్న శాంటాను, ఆ తర్వాత ఆయనే ఎరుపు రంగు కోటులో చిత్రించారు. ఇది కోకాకోలా అడ్వర్టైజ్‌మెంట్లకు చాలా ఏళ్ల ముందే జరిగింది.
పాతకాలపు గ్రీటింగ్ కార్డ్స్: 19వ శతాబ్దం చివరలో వచ్చిన అనేక పోస్ట్ కార్డులు, పత్రికలలో శాంటా కేవలం ఎరుపు మాత్రమే కాకుండా.. ఆకుపచ్చ, నీలం, ఊదా రంగుల్లో కూడా కనిపించేవారు. అయితే ఎరుపు రంగు ఫోటోలు ఎక్కువగా ప్రజలను ఆకర్షించాయి.
కోకాకోలా యాడ్‌లో శాంటా క్లాజ్..
కోకాకోలా శాంటాకు ఎరుపు రంగును కనిపెట్టలేదు, కానీ ఆ రంగును ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసింది. హ్యాడన్ సండ్‌బ్లోమ్ అనే కళాకారుడు కోకాకోలా కోసం గీసిన శాంటా బొమ్మలు.. శాంటాను ఒక ఆకర్షణీయమైన, లావుగా ఉండే, ఎప్పుడూ నవ్వుతూ ఉండే తాతగా మార్చేశాయి. ఆ ప్రకటనలు ఎంతగా ప్రజల్లోకి వెళ్లాయంటే.. అప్పటి నుండి ప్రజలు శాంటాను వేరే రంగుల్లో ఊహించుకోవడం మానేశారు. క్రిస్మస్ పండుగలో ఎరుపు రంగు సంతోషానికి, ఉత్సాహానికి, త్యాగానికి చిహ్నంగా భావిస్తారు. చలికాలంలో మంచు కురుస్తున్నప్పుడు తెల్లని బ్యాగ్రౌండ్‌లో రెడ్ కలర్ బాగా కనిపించడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు.
Follow Us