/rtv/media/media_files/2025/12/24/biryani-2025-12-24-06-40-16.jpg)
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ తన 10వ వార్షిక నివేదిక 'హౌ ఇండియా స్విగ్గీడ్ 2025'ను విడుదల చేసింది. ఈ ఏడాది కూడా భారతీయుల ఆహారపు అలవాట్లలో బిర్యానీ తిరుగులేని ఆధిపత్యం కొనసాగించింది. వరుసగా పదో ఏడాది కూడా దేశంలో అత్యధికంగా ఆర్డర్ల చేసిన వంటకంగా బిర్యానీ నిలిచింది. 2025లో భారతీయులు ఏకంగా 9.3 కోట్ల బిర్యానీలను ఆర్డర్ చేశారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా సగటున ప్రతి నిమిషానికి 194 బిర్యానీలు, అంటే ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ డెలివరీ చేయబడింది. ఇందులో చికెన్ బిర్యానీ 5.77 కోట్ల ఆర్డర్లతో అగ్రస్థానంలో నిలిచింది.
From biryani to burgers: Top 10 most-ordered dishes on Swiggy in 2025https://t.co/4DfCRrQeR7
— CNBC-TV18 (@CNBCTV18Live) December 23, 2025
🚨 Biggest purchases in Swiggy Instamart in 2025.
— Indian Tech & Infra (@IndianTechGuide) December 23, 2025
• A Bengaluru user spent ₹4.36 lakh on noodles alone
• A Mumbai user spent ₹16.3 lakh on Red Bull Sugar Free
• A Chennai user spent ₹2.41 lakh on pet supplies
• A Bengaluru order paired a ₹1.7 lakh iPhone with a ₹178…
టాప్ 5 ఆర్డర్ ఐటమ్స్ ఇవే
బిర్యానీ తర్వాత ఇండియన్స్ అత్యధికంగా ఇష్టపడిన ఫుడ్ ఐటమ్ బర్గర్. ఈ ఏడాది స్విగ్గీలో 4.42 కోట్ల బర్గర్ ఆర్డర్లు వచ్చాయి. స్నాక్స్ విభాగంలో చికెన్ బర్గర్లు, వెజ్ బర్గర్లు ఆర్డర్లు పోటీ పడ్డాయి. బర్గర్ తర్వాత మూడవ స్థానంలో పిజ్జా నిలిచింది. 2025లో సుమారు 4.01 కోట్ల పిజ్జా ఆర్డర్లు వచ్చాయి. ఇక సౌత్ ఇండియన్ ఫేవరెట్ అయిన వెజ్ దోశ 2.62 కోట్ల ఆర్డర్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. అల్పాహారాల విభాగంలో ఇడ్లీ (1.1 కోట్లు) మొదటి స్థానంలో నిలవగా, మసాలా దోశ రెండో స్థానంలో ఉంది. రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య చికెన్ బర్గర్లు, బిర్యానీలు అత్యధికంగా ఆర్డర్ చేయబడ్డాయి. బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా.. బెంగళూరు, ముంబై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబైకి చెందిన ఓ కస్టమర్ ఏడాదిలో ఏకంగా 3,196 సార్లు ఫుడ్ ఆర్డర్ చేసి రికార్డు సృష్టించారు. అంటే రోజుకు సగటున 9 ఆర్డర్లు. స్వీట్స్ విభాగంలో గులాబ్ జామున్, చాక్లెట్ కేకులు టాప్‌లో నిలిచాయి.
Follow Us