high blood pressure
High Blood Pressure: ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటు అనేది అత్యంత సాధారణంగా కనిపించే జీవనశైలి సంబంధిత వ్యాధులలో ఒకటిగా మారిపోయింది. అయితే ఇది సాధారణ వ్యాధి కాదు. తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, నిరంతర ఒత్తిడి వంటి జీవనశైలి అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. గతంలో అధిక రక్తపోటు ఎక్కువగా ముసలివారిలో కనిపించేదిగానీ.. నేటి కాలంలో యువతే కాకుండా చిన్న వయస్సులో ఉన్నవారిలో కూడా ఇది కనిపిస్తున్నదంటే పరిస్థితి ఎంత ఘోరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇది సకాలంలో గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలు వంటి భయంకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి. అధిక రక్తపోటు వలన ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
బిపిని పెంచడంలో ప్రత్యక్షంగా ప్రభావం:
ఇది జీవనశైలికి సంబంధించిన సమస్య కాబట్టి.. దీని నిర్వహణకు జీవనశైలిలో మార్పులు అనివార్యం. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. మనకు ఇష్టమైన ప్యాకేజ్డ్ నూడుల్స్, చిప్స్, బిస్కెట్లు, పాస్తా వంటి ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అధికంగా సోడియం, ట్రాన్స్ ఫ్యాట్స్, రసాయనిక పదార్థాలు ఉంటాయి. పకోడీలు, సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు వంటివి రుచిగా ఉన్నా అవి అధిక ట్రాన్స్ ఫ్యాట్లు కలిగి ఉండటం వల్ల రక్తనాళాలపై ఒత్తిడిని పెంచి బిపిని పెంచుతాయి.
ఇది కూడా చదవండి: పిల్లల్లో ఈ అలవాటు ఆరోగ్యానికి ప్రమాదమా..?
ఇంకా ఊరగాయలు, పాపడ్లు కూడా బిపిని ప్రభావితం చేసే ఆహారాల్లోకే వస్తాయి. వీటిలో నూనె, ఉప్పు, వెనిగర్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇవి రోజూ తీసుకుంటే రక్తపోటు నియంత్రణ కష్టమవుతుంది. చాలామంది ఉప్పు ఎక్కువగా తినడం వల్లే బిపి పెరుగుతుందని అనుకుంటారు. కానీ నిజానికి తీపి పదార్థాలు కూడా అంతే ప్రమాదకరం. చాక్లెట్‌లు, స్వీట్లు, బేకరీ వస్తువులు తినడం వలన ఇన్సులిన్ స్థాయి పెరిగి, రక్తనాళాలు బిగుసుకుంటాయి. దీని ఫలితంగా బిపి స్థాయి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మితాహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవనశైలి వల్ల అధిక రక్తపోటును సమర్థంగా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పీరియడ్స్ సమయంలో ఈ పదార్ధాలు తింటే సమస్య అధికంగా ఉంటుందా..?
( high-blood-pressure | elaichi-benefits-for-high-blood-pressure | drinks-to-lower-high-blood-pressure | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news )