/rtv/media/media_files/2025/05/17/GNfRLuoV1RJwy9XhGs5O.jpg)
Thumb Sucking Habit Effects
Thumb Sucking Habit Effects: చిన్నపిల్లలు(Childrens) బొటనవేలు పీల్చడం చాలా సాధారణమైన అలవాటు. ఇది ఎక్కువగా వారి మనస్తత్వాన్ని ప్రదర్శించే ఒక మార్గంగా ఉండొచ్చు. అయితే ఇది నిలకడగా కొనసాగితే పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపించగలదు. తల్లిదండ్రులు దీనిని చిన్నచూపు చూడకుండా.. తొందరగా పరిష్కార మార్గాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది పిల్లలు ఈ అలవాటును సహజంగానే మానేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది పాతికేళ్ల వరకు కూడా కొనసాగవచ్చు. బొటనవేలు పీల్చడం వల్ల ముందు దంతాలు ముందుకు పొడుచుకుని రావడం, దవడ నిర్మాణం తప్పు దోవ పడటం జరుగుతుంది. దీని ఫలితంగా భవిష్యత్తులో ఆర్థోడాంటిక్ చికిత్స అవసరం అవుతుందని నిపుణులు హెచ్చస్తున్నారు.
Also Read: రాజమౌళికి బిగ్ షాక్.. ఆ సినిమా ఆగిపోయినట్టే..!
Also Read: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిసైల్ ఇదే..! ధర ఎంతంటే?
ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అవకాశం..
అంతేకాకుండా నోటి చుట్టూ ఉన్న చర్మం నిరంతరం తడిగా ఉండటం వల్ల చర్మం పొడిబారడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. మురికి చేతులతో బొటనవేలు నోట్లో పెట్టడం వల్ల క్రిములు శరీరంలోకి ప్రవేశించి జీర్ణ సంబంధిత సమస్యలు, నోటి పూతలు, గొంతు నొప్పి వంటివి కలగవచ్చు. పిల్లల నాలుక, నోటి కండరాల అభివృద్ధికి ఇది అడ్డుగా నిలిచే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా పదాలను సరిగా పలకలేకపోవడం, మాట్లాడటంలో ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీని ప్రభావం వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంటుంది.
Also Read: అనకాపల్లి మిస్సింగ్ కలకలం.. నాలుగేళ్ల లోహితను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని మహిళ
శారీరకంగా బొటనవేలు బలహీనపడటంతోపాటు.. దీర్ఘకాలంగా ఈ అలవాటు కొనసాగితే చర్మంపై చిన్న గాయాలు ఏర్పడి ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. దీన్ని నియంత్రించడానికి పిల్లలకు సానుభూతితో సమయాన్ని గడపడం, బొమ్మలు, పుస్తకాలతో దృష్టి మళ్లించడం అవసరం. చేదు రసాయనాలను వాడటం, చేతి తొడుగులు తొడిపించడం కూడా ఒక మార్గం. బిడ్డల ఆరోగ్య భద్రత కోసం ఈ అలవాటు తీవ్రమయ్యేలోపు చర్యలు తీసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. ప్రేమతో, సహనంతో తీసుకున్న నిర్ణయాలు వారికి ఆరోగ్యంగా ఎదగడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: చియా సీడ్స్ రోజూ తింటున్నారా..? నెల రోజుల్లో మీ శరీరంలో జరిగేది ఇదే..!
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)