/rtv/media/media_files/2025/10/15/beauty-tips-2025-10-15-13-36-02.jpg)
Beauty Tips
నేటి కాలంలో మెరిసే, కాంతివంతమైన చర్మాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. ఖరీదైన ఉత్పత్తులు వాడటం మాత్రమే కాకుండా.. దినచర్యలో సరైన మార్పులు చేసుకుంటేనే చర్మానికి పూర్తి సంరక్షణ లభిస్తుంది. సహజసిద్ధమైన, ప్రభావవంతమైన ఈ 6 చిట్కాలను మీ అందం రొటీన్‌లో చేర్చుకోవడం ద్వారా గ్లాస్-లైక్ చర్మాన్ని పొందవచ్చని చర్మ నిపుణులు చెబుతున్నారు. మెరిసే చర్మం కోసం బ్యూటీ అలవాట్ల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
విటమిన్ సి సీరమ్:
విటమిన్ సి చర్మానికి కొత్త జీవం పోసి.. ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అలాగే నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. ఉదయం స్కిన్‌కేర్ రొటీన్‌లో విటమిన్ సి సీరమ్(Vitamin C Serum)ను తప్పకుండా చేర్చుకోవాలి.
రోజ్ వాటర్ టోనర్:
రోజ్ వాటర్ (Rose Water Toner) ఒక అద్భుతమైన సహజ టోనర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాక.. మృదువుగా ఉంచుతుంది. ముఖాన్ని కడుక్కున్న తర్వాత రోజ్ వాటర్‌ను అప్లై చేయడం వలన చర్మ రంధ్రాలు శుభ్రపడి, చర్మం తాజాగా ఉంటుంది.
నిమ్మ, తేనె ఫేస్ మాస్క్:
నిమ్మకాయలో సహజమైన బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. తేనె చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ఈ మాస్క్‌ను వారానికి రెండు లేదా మూడు సార్లు ముఖానికి రాసుకోవడం వలన చర్మం కాంతివంతమై.. నల్ల మచ్చలు తేలికవుతాయి.
హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్:
చర్మానికి తేమ చాలా ముఖ్యం. హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్ చర్మానికి అవసరమైన తేమను అందించి.. ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. దీన్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించవచ్చు.
ఇది కూడా చదవండి: రాత్రి పూట పదే పదే దాహం వేస్తోందా..? అయితే.. మీకు ఆ డేంజర్ వ్యాధి ముప్పు ఉన్నటే!!
ముఖ కండరాల మసాజ్:
కేవలం ఉత్పత్తులు వాడటమే కాక.. ముఖానికి మసాజ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ముఖ కండరాలను మృదువుగా మసాజ్ చేయడం వలన రక్త ప్రసరణ మెరుగుపడి.. చర్మానికి ప్రకాశం లభిస్తుంది.
సరైన ఆహారం:
మెరిసే చర్మానికి బయటి సంరక్షణ మాత్రమే సరిపోదు. విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు, నట్స్ వంటి ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి. రోజంతా నీరు తాగడం వలన చర్మం లోపలి నుంచి హైడ్రేట్‌గా ఉండి నిగారింపును సంతరించుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రోజుకు శక్తినిచ్చే అద్భుతమైన పానీయాలు.. ఉదయాన్నే వీటిని తాగితే ఆరోగ్యమే ఆరోగ్యం!!