/rtv/media/media_files/2025/09/22/navaratri-special-2025-09-22-15-32-41.jpg)
Navaratri special
దేశవ్యాప్తంగా నవరాత్రి పండుగ ఘనంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు. ఇది దుర్గాదేవిని శక్తి స్వరూపిణిగా ఆరాధించే ముఖ్యమైన పండుగ. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. పదో రోజు విజయదశమి లేదా దసరాగా జరుపుకుంటారు. అయితే ఈ తొమ్మిది రోజుల పండుగలో చాలామంది భక్తులు ఉపవాసాలు పాటిస్తారు. అయితే కొన్ని గంటలు ఆహారం లేకుండా ఉండడం వల్ల నీరసం, అలసట కలుగుతాయి. ఈ సమస్యను అధిగమించి, ఉపవాసంలో కూడా శక్తితో ఉండడానికి సులభమైన, పోషక విలువలు అధికంగా ఉండే స్మూతీ రెసిపీని తినవచ్చు. ఈ స్మూతీని కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీనికి కొన్ని విషయాలు ఈ ఆక్టికల్‌లో తెలుసుకుందాం.
స్మూతీ తయారు కోసం:
స్మూతీ అనేది పండ్ల, కూరగాయలు, మరియు ఇతర ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారుచేసిన రుచికరమైన.. ఆరోగ్యకరమైన పానీయం. ఇది చాలా తక్కువ సమయంలో పోషకాలు, విటమిన్‌లు, మినరల్స్‌ను పొందడానికి గొప్ప మార్గం. అరటిపండు, స్ట్రాబెర్రీలు, పాలకూర, బాదం పాలు వంటి పదార్థాలను ఉపయోగించి స్మూతీ తయారుచేసుకోవచ్చు. ఇది రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చడానికి సరళమైన, అనుకూలమైన మార్గం. స్మూతీని అభిరుచికి అనుగుణంగా తయారు చేసుకోవచ్చు.. దీనితో ఇది అద్భుతమైన అల్పాహారం లేదా స్నాక్‌గా మారుతుంది. ఈ స్మూతీలో జీడిపప్పు, బాదం, వాల్‌నట్‌లు, అంజూర పండ్లు, తామర గింజలు, కుంకుమపువ్వు వంటి ప్రోటీన్, పోషకాలు అధికంగా ఉండే పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరం అలసిపోకుండా చూసి.. రోజు మొత్తం ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.
ఇది కూడా చదవండి: నాలుగు రోజులు చాలు జంక్ ఫుడ్ మీ బుర్రను తినేయడానికి!!
ముందుగా ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం, వాల్‌నట్‌లు, అంజూర పండ్లును రాత్రంతా పాలలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల అవి బాగా ఉబ్బుతాయి. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, తామర గింజలు, కొద్దిగా పాలు, కుంకుమపువ్వును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. స్మూతీ తీపిగా కావాలంటే సహజమైన తీపి కోసం కొన్ని ఖర్జూరాలను జోడించుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ శక్తి కావాలంటే అరటిపండును కూడా కలుపుకోవచ్చు. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలి కాకుండా చేస్తుంది. ఈ స్మూతీని గ్లాసులో పోసి చల్లగా తాగవచ్చు. కావాలంటే.. ఐస్ క్యూబ్స్ వేసుకుని మరింత చల్లగా ఆస్వాదించవచ్చు. ఉపవాసం సమయంలో బలహీనంగా ఉన్నట్లు అనిపించినప్పుడు.. ఈ స్మూతీని తీసుకోవడం ద్వారా వెంటనే శక్తిని పొందవచ్చు. ఈ నవరాత్రి మాతా దుర్గను ఆరాధించడంతోపాటు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి:నాజూకైన నడుము కోసం ఈ వ్యాయామాలు చేయండి