/rtv/media/media_files/2025/09/10/silent-heart-attack-2025-09-10-13-25-18.jpg)
Silent Heart Attack
గుండెపోటు అనేది గుండె కండరాలకు రక్త ప్రవాహం ఆగిపోయినప్పుడు సంభవించే ఒక తీవ్రమైన వైద్య పరిస్థితి. ఈ పరిస్థితి సాధారణంగా కొరోనరీ ఆర్టరీలో అడ్డంకి ఏర్పడినప్పుడు జరుగుతుంది. ఈ అడ్డంకి వల్ల గుండె కండరాలకు ఆక్సిజన్ అందదు.. ఫలితంగా గుండె కణాలు చనిపోతాయి. గుండెపోటు సాధారణ లక్షణాలు ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం, చేయి, మెడ, దవడలోకి నొప్పి వ్యాపించడం, శ్వాస ఆడకపోవడం, చెమట పట్టడం, వికారం వంటి ఉంటాయి. ఇలా లక్షణాలు ఉంటే అది అత్యవసర పరిస్థితి.. వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. సకాలంలో చికిత్స అందించకపోతే తీవ్రమైన సమస్యలు లేదా మరణం సంభవించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి(Life Style).. సరైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి గుండెపోటును నివారించడంలో సహాయపడతాయి. సైలెంట్ హార్ట్ ఎటాక్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోటాలో కొన్న విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు:
హార్ట్ ఎటాక్ అంటే ఛాతీలో తీవ్రమైన నొప్పి, భారంగా ఉండటం, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలే గుర్తుకు వస్తాయి. కానీ ఈ లక్షణాలు లేకుండానే వచ్చే గుండెపోటును సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే సాధారణ జబ్బులుగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు. కార్డియాలజీ డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. ఈ రోజుల్లో అకస్మాత్తుగా కార్డియాక్ సమస్యలు పెరిగిపోతున్నాయంటున్నారు. దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఛాతీ లేదా వెనుక భాగంలో నొప్పి, దంతాలు, చేతులు లేదా వీపులో నొప్పి, ఆయాసం, తల తిరగడం, మైకం, ఛాతీ పైభాగంలో అసౌకర్యం, చల్లని చెమటలు, వాంతులు, వికారం, కొన్ని రోజులుగా కారణం లేకుండా అలసట ముఖ్యంగా గుండెపోటు వచ్చే ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు ఫ్లూ జ్వరం మాదిరిగా అనిపిస్తాయి. కానీ నిద్రలో లేదా మేల్కొని ఉన్నప్పుడు కూడా గుండెపోటు రావచ్చని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఆస్తమా పరార్.. ఆ మొక్కల లిస్ట్ ఇదే!
70-80 శాతం గుండెపోటు(Heart Attack) కేసులు లక్షణాలు లేకుండానే వస్తున్నాయి. నొప్పి లేకపోవడం వల్ల చాలామంది సకాలంలో చికిత్స తీసుకోలేకపోతున్నారు. దీనివల్ల మరణాల రేటు పెరుగుతోంది. అయితే మహిళలు, వృద్ధులకు ఎక్కువ ప్రమాదం ఉంది. అంతేకాకుండా డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు, గతంలో గుండెపోటు వచ్చినవారు, అధిక బరువు ఉన్నవారు, మద్యపానం, ధూమపానం చేసేవారు ఎక్కువ ప్రమాదం ఉందని చెబుతున్నారు. సైలెంట్ హార్ట్ ఎటాక్ ప్రధాన కారణం కొవ్వు గడ్డలు పగిలి ధమనులలో రక్తం గడ్డకట్టడం వంటి ఉంటాయి. స్ట్రెస్ టెస్ట్, ఈసీజీ, రక్త పరీక్షల ద్వారా ఈ సమస్యను గుర్తించవచ్చని వైద్యులు అంటున్నారు. మీకు ఏవైనా అనుమానాస్పద లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం అత్యంత ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పితృ పక్షంలో ఉల్లిపాయ వెల్లుల్లి నిషిద్ధం! ఎందుకో తెలుసుకోండి