/rtv/media/media_files/2025/09/05/onion-garlic-and-paternal-side-2025-09-05-16-18-37.jpg)
onion-garlic And Pitru Poshka
ఈ సంవత్సరం పితృపక్షం సెప్టెంబర్ 7 ఆదివారం ప్రారంభమవుతోంది. ఇదే రోజున 2025 సంవత్సరపు చివరి చంద్రగ్రహణం(Chandra Grahan 2025) కూడా సంభవిస్తుండటం ఒక విశేషం. హిందూ సంప్రదాయాల ప్రకారం.. ఈ పితృ పక్ష(Pitru Poshka) సమయాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ పదిహేను రోజులలో ఆహార-విహారాలపై ప్రత్యేక నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పితృ పక్షాన్ని శ్రాద్ధ పక్షం లేదా మహాలయ పక్షం అని కూడా అంటారు. భాద్రపద పూర్ణిమ నుంచి ఆశ్వయుజ అమావాస్య వరకు ఉండే ఈ పక్షం దాదాపు 16 రోజుల పాటు ఉంటుంది. ఈ సమయంలో పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం, శ్రాద్ధ కర్మలు చేస్తారు. దీనివల్ల పితరుల ఆశీర్వాదంతో కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు లభిస్తాయని నమ్మకం. శ్రాద్ధ పక్షం 2025 ఈసారి ప్రత్యేకతలు, ప్రాముఖ్యత, ఆహార నియమాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పితృ పక్షంలో మనస్సును శుద్ధి చేసుకుని..
ఈ పవిత్ర కాలంలో కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలని ధర్మశాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు నిషిద్ధం చేస్తారనే సందేహం చాలామందికి ఉంటుంది. ఇవి రాజసిక, తామసిక గుణాలు కలిగినవిగా చెబుతారు. వీటిని తినడం వల్ల మనసు అశాంతికిలోనై ఆధ్యాత్మిక చింతన, పూజలపై ఏకాగ్రత దెబ్బతింటుందని భావిస్తారు. పితృ పక్షంలో మనస్సును శుద్ధి చేసుకుని పూర్వీకుల ఆశీస్సులు పొందడమే ప్రధాన ఉద్దేశ్యం. ఉల్లి, వెల్లుల్లి పుట్టుక గురించి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది. పాలసముద్ర మథనం సమయంలో రాహువు అనే రాక్షసుడు దేవతల మధ్య చేరి అమృతం తాగేందుకు ప్రయత్నించగా.. విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో అతడి తలను ఖండించారు.
ఇది కూడా చదవండి: 13 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన న్యూడిల్స్.. ఈ విషయం తెలిస్తే ఇంకోసారి చచ్చినా తినరు!
ఆ సమయంలో కిందపడిన రక్తం బిందువుల నుండే ఉల్లి, వెల్లుల్లి పుట్టాయని.. అందుకే వాటికి తామసిక లక్షణాలు ఉంటాయని చెబుతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజుల్లో ఈ పదార్థాలను నిషిద్ధం చేశారు. పితృ పక్షంలో పండ్లు, పాలు, పెరుగు, కాలానుగుణంగా లభించే కూరగాయలు వంటి సాత్విక భోజనం తీసుకోవాలని సూచించబడింది. ఈ ఆహారం శరీరాన్ని తేలికగా ఉంచి.. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. శ్రాద్ధ కర్మలు పూర్వీకుల ఆత్మలకు శాంతి, మోక్షం కలిగిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సమయంలో వారి ఆత్మలు తమ వారసుల నుంచి తర్పణం ఆశిస్తూ భూమిపైకి వస్తాయని విశ్వాసం ఉందని పండితులు చెబుతున్నారు..
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఈ నివారణకు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఆస్తమా పరార్.. ఆ మొక్కల లిస్ట్ ఇదే!