Partner: నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో పురుషులలో కామాంద్యం లేకపోవడం అనే సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. చాలామంది పురుషులు తమకు లైంగిక జీవితంలో ఎలాంటి సమస్యలు లేవని నమ్మినా, వాస్తవానికి వారు ఎదుర్కొంటున్న మార్పులను వారు స్వయంగా గుర్తించ లేకపోతుంటారు. ముఖ్యంగా లైంగిక ఆసక్తి తగ్గిపోవడం అనేది మొదటి దశలో గుర్తించాల్సిన ముఖ్యమైన సంకేతం. సాధారణంగా పురుషులు లైంగిక విషయాలపై మాట్లాడటానికి ఆసక్తి చూపుతారు. కానీ ఒక వేళ మీ భాగస్వామి ఈ విషయంలో మౌనంగా ఉంటే లేదా తప్పించుకునే ప్రయత్నం చేస్తే అది వారి మనోభావాలలో మార్పు జరిగిందనే సంకేతంగా పరిగణించాలి.
లైంగిక తృప్తిని తగ్గిస్తుంది:
వారు తరచూ లైంగిక చర్యల నుండి తప్పించుకుంటే లేదా మీరు లైంగికంగా స్పందించినప్పటికీ వారిలో ఆసక్తి కనబడకపోతే అది స్పష్టంగా లిబిడో తక్కువగా ఉన్నట్లు సూచిస్తుంది. ఇది కొనసాగితే అంగస్తంభన సమస్యలను తెచ్చిపెడుతుంది. పురుషాంగం తక్కువ సమయంలోనే తగ్గిపోవడం, లేదా ఎప్పటికప్పుడు నిటారుగా లేకపోవడం, లైంగిక తృప్తిని తగ్గిస్తుంది. ఇది భావోద్వేగ రుగ్మతలకు దారితీస్తుంది. ఈ పరిస్థితిలో అనేక మానసిక సమస్యలు కూడా వస్తాయి. గిల్టీ ఫీలింగ్, కలతలు, భాగస్వామితో అనుబంధంలో అంతరాలు ఏర్పడటం మొదలవుతాయి. ఎంతగా వారి మనసును అర్థం చేసుకొని వారిని ప్రేరేపించినా కూడా వారు స్పందించకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది.
ఇది కూడా చదవండి: టమోటాలు ఇలా వాడారంటే జుట్టు వద్దన్నా పెరుగుతుంది
ఇది వారు ఒత్తిడిలో ఉన్నారనే సంకేతమవచ్చు, లేదా హార్మోన్ లోపం, ఆరోగ్య సమస్యల ప్రభావం కావచ్చు. అలాగే లైంగిక ఆసక్తి లేకపోవడం అనే సమస్యను మహిళలు కూడా ఎదుర్కొంటారు. మహిళలలో లైంగిక ఉదాసీనతకు కారణాలు నొప్పి, అసాధారణ స్రావం, సక్రమ రక్తస్రావం కాకపోవడం వంటి శారీరక సమస్యలు కావచ్చు. ఇవన్నీ వారిలో లైంగిక దూరాన్ని పెంచుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు భాగస్వాములు ఓపికగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అయితే సమస్యలు పదేపదే ఎదురైతే తప్పక వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: శృంగారం తర్వాత పురుషులకు తలెత్తే సమస్యలు ఇవే
( life-partner | same-sex-partner | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)