Men Health
Men Health: కొంతమంది పురుషులు లైంగిక జీవితం పూర్తిగా ఆస్వాదించ లేకపోవడం వెనుక శారీరక సమస్యలు ఉండొచ్చు. ముఖ్యంగా లైంగిక సంపర్కం తరువాత కలిగే కొన్ని సమస్యలు వారి భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యలు చాలా సందర్భాల్లో తాత్కాలికమై నవే కాగా సరైన పరిజ్ఞానం, శుభ్రతతో అవి పూర్తిగా తగ్గిపోతాయి. లైంగిక చర్య అనంతరం పురుషాంగంపై ఎర్రటి మచ్చలు కనిపించటం, దురద లేదా మలిన పదార్థం రావడం వంటి లక్షణాలు సాధారణంగా సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్ వల్ల కలుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం.
పురుషాంగ నొప్పి కలగడం..
మలిన లోదుస్తులు తిరిగి ధరించకూడదు. ముఖ్యంగా లైంగిక చర్య తర్వాత వెంటనే శుభ్రంగా కడుక్కోవడం, గోరు వెచ్చని నీటిని ఉపయోగించడం ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టవచ్చు. కండోమ్ వినియోగం ద్వారా కూడా ఈ సమస్యల నుంచి రక్షణ కలిగిస్తుంది. కండోమ్స్ పలు రకాల సూక్ష్మజీవులను పరిమితం చేయడంలో సహాయపడతాయి. మరో వైపు లైంగిక సంపర్కం తర్వాత పురుషాంగ నొప్పి కలగడం కూడా ఒక సాధారణమైన సమస్య. ఇది ప్రధానంగా శరీరానికి అసౌకర్యమైన లైంగిక భంగిమల వల్ల కలగవచ్చు. అలాంటి సమయంలో కొన్ని రోజులు శారీరక సంబంధాలను నివారించడం మంచిది.
ఇది కూడా చదవండి: నోటి దుర్వాసనతో కూడా షుగర్ ఉందోలేదో తెలుస్తుందా?
శరీరానికి విశ్రాంతినిచ్చి, నొప్పి తగ్గే వరకు వేచి ఉండటం అవసరం. కొన్ని సందర్భాల్లో హస్త ప్రయోగం కూడా ఇబ్బందులను పెంచవచ్చు కనుక దాన్ని కూడా తాత్కాలికంగా మానుకోవడం మంచిది. వాపు, దురద, నొప్పి వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే వాటిని లైట్‌గా తీసుకోకూడదు. కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ను సూచించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం. ఇంటి వద్దనే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే సమస్యలు మళ్లీ మళ్లీ రావడం మొదలైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. లైంగిక ఆరోగ్యంపై సరైన అవగాహన కలిగి ఉండటం ద్వారా మాత్రమే దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రక్తహీనతతో బాధపడేవారు ఇవి తప్పక తినాలి
( men-health | men-health-special | men-health-tips | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )