Sperm Donation: విచ్చలవిడిగా వీర్యదానం చేస్తానంటే కుదరదు.. ఈ రూల్స్ పాటించాల్సిందే!

పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, భారత సంతానోత్పత్తి నియంత్రణ చట్టం (ART Act 2021), ICMR మార్గదర్శకాల ప్రకారం ఆసుపత్రులు, స్పెర్మ్ బ్యాంకులు కఠినమైన నిబంధనలను అమలు చేస్తాయి. స్పెర్మ్ డొనేషన్‌లో హాస్పిటల్స్ చాలా రూల్స్ పాటిస్తాయి.

New Update
Sperm donation

రక్తదానం, అవయవదానం ఓ వ్యక్తిని బతికిస్తే వీర్యదానం మాత్రం ఓ వ్యక్తిని పుట్టిస్తుంది. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న దంపతులకు ఇది గొప్పవరం. అయితే, ఇది కేవలం రక్తదానంలా సులభమైనది కాదు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, భారత సంతానోత్పత్తి నియంత్రణ చట్టం (ART Act 2021), ICMR మార్గదర్శకాల ప్రకారం ఆసుపత్రులు, స్పెర్మ్ బ్యాంకులు కఠినమైన నిబంధనలను అమలు చేస్తాయి. స్పెర్మ్ డొనేషన్‌లో హాస్పిటల్స్ చాలా రూల్స్ పాటిస్తాయి. 

Also Read :  సిగరెట్ తాగేవారికి బిగ్ షాక్.. భారీగా పెరిగిపోనున్న ధరలు!

స్పెర్మ్ డొనేషన్ లిమిట్:

ఒక దాత తన వీర్యాన్ని ఎన్నిసార్లు దానం చేయవచ్చు అనే దానిపై కూడా చట్టపరమైన పరిమితులు ఉన్నాయి (జన్యుపరమైన సమస్యలు రాకుండా చూడటం కోసం). వీర్య దానం అనేది వ్యాపారం కాదు, అదొక స్వచ్ఛంద సేవ. దీని కోసం దాతకు ప్రయాణ ఖర్చులు లేదా ఇతర అసౌకర్యాల కోసం కొంత పరిహారం మాత్రమే అందుతుంది. ఒకే దాత వీర్యాన్ని అనేకమందికి ఉపయోగించి, దాంతో చాలా మంది పిల్లలు పుడితే, భవిష్యత్తులో వారికి తెలియకుండానే వారి మధ్య వివాహాలు లేదా శృంగార సంబంధాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల పుట్టబోయే తర్వాతి తరంలో జన్యు లోపాలు తలెత్తుతాయి. అరుదైన వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి బదిలీ అయ్యే అవకాశం పెరుగుతుంది.

భారతదేశంలోని కొత్త నిబంధనల ప్రకారం.. ఒక స్పెర్మ్ డొనర్ తన జీవితకాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే దానం చేయాలి.  ఆ దాత నుండి సేకరించిన శాంపిల్ ఒక  ఒక మహిళకు మాత్రమే ఉపయోగించాలని కొన్ని కఠినమైన రూల్స్ ఉన్నాయి. ఒకే దాత వీర్యం ద్వారా పుట్టిన పిల్లల సంఖ్యపై పరిమితి విధించడం వల్ల సమాజంలో జన్యు వైవిధ్యం కాపాడబడుతుంది. గతంలో ఈ విషయాలను పర్యవేక్షించడం కష్టమయ్యేది కానీ ఇప్పుడు దాతల వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం ద్వారా, ఒక వ్యక్తి వివిధ బ్యాంకుల్లో వీర్య దానం చేయకుండా అడ్డుకుంటున్నారు. దీన్ని ట్రాకింగ్ సిస్టమ్ అంటారు. ప్రతి స్పెర్మ్ బ్యాంక్ సేకరించిన వీర్యం ఎంతమందికి ఉపయోగించారో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.

ఏజ్ లిమిట్: 
వీర్య దానం(Sperm Donation) చేసే వ్యక్తి వయసు సాధారణంగా 21 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. కొన్ని క్లినిక్‌లు నాణ్యత కోసం 35 ఏళ్ల లోపు వారికే ప్రియారిటీ ఇస్తాయి. అంతేకాదు వీర్యం దానం చేసే వ్యక్తి శారీరకంగా, మానసికంగ పూర్తి ఆరోగ్యవంతుడై ఉండాలి. 

ఆరోగ్య పరీక్షలు:
వీర్య దానం చేసే ముందు దాతకు అనేక రకాల మెడికల్ టెస్టులు(Sperm Count Test) నిర్వహిస్తారు. HIV, హెపటైటిస్ B, C, సిఫిలిస్ వంటి సుఖవ్యాధులు లేవని నిర్ధారించుకోవడానికి రక్త పరీక్షలు చేస్తారు. సిస్టిక్ ఫైబ్రోసిస్, తలసేమియా లేదా వంశపారంపర్యంగా వచ్చే ఇతర వ్యాధుల ముప్పును అంచనా వేస్తారు. అంతేకాదు స్పెర్మ్ ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు లేదా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా అని ఆరా తీస్తారు. 

స్పెర్మ్ క్వాలిటీ: 
ప్రతి దాత వీర్యం శాంపిల్(Sperm Cells) పరీక్షించబడుతుంది. మిలీలీటరుకు కనీసం 15 నుండి 20 మిలియన్ల కణాలు ఉండాలి. కనీసం 40% కణాలు చురుగ్గా కదులుతూ ఉండాలి. వీర్యాన్ని ఘనీభవించిన స్థితిలో ఉంచినప్పుడు, అది చెడిపోకుండా ఉండే సామర్థ్యం కలిగి ఉండాలి.

Also Read :  Horoscope 2026: బుధ గ్రహ సంచార ప్రభావం.. 2026లో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

క్వారంటైన్ అండ్ స్టోరేజ్

దాత ఇచ్చిన వీర్యాన్ని వెంటనే రోగికి ఉపయోగించరు. దానిని కనీసం 6 నెలల పాటు క్వారంటైన్లో (Liquid Nitrogen లో) ఉంచుతారు. ఆరు నెలల తర్వాత దాతకు మళ్లీ HIV పరీక్షలు నిర్వహించి, నెగటివ్ అని వస్తేనే ఆ వీర్యాన్ని వినియోగిస్తారు. దాతలు ధూమపానం, మద్యం, డ్రగ్స్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. వీర్యం ఇచ్చే ముందు కనీసం 3 నుండి 5 రోజుల పాటు శృంగారానికి లేదా హస్తప్రయోగానికి దూరంగా ఉండాలని ఆసుపత్రులు సూచిస్తాయి.

గోప్యత, చట్టపరమైన అంశాలు

స్పెర్మ్ డొనేన్ వివరాలు అది తీసుకునే దంపతులకు, అలాగే దంపతుల వివరాలను దాతకు వెల్లడించరు. ఈ డిటేల్స్ హాస్పిటల్ యాజమాన్యాలు సీక్రెట్‌గా ఉంచుతారు. వీర్య దాతకు పుట్టబోయే బిడ్డపై ఎటువంటి చట్టపరమైన లేదా నైతిక హక్కులు ఉండవు. బిడ్డ పూర్తిగా దంపతులకే చెందుతుంది.

Advertisment
తాజా కథనాలు