Horoscope 2026: బుధ గ్రహ సంచార ప్రభావం.. 2026లో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు వల్ల కొన్ని రాశుల వారికి మంచి, చెడులు జరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది ముగిసే సరికి బుధ గ్రహం తన ప్లేస్‌ను మార్చనుంది. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి వచ్చే ఏడాది పట్టిందల్లా బంగారమేనని పండితులు అంటున్నారు.

New Update
Today Horoscope

Today Horoscope

జ్యోతిష్య శాస్త్రం(Horoscope 2026) ప్రకారం గ్రహాల కదలికలు వల్ల కొన్ని రాశుల వారికి మంచి, చెడులు జరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది ముగిసే సరికి బుధ గ్రహం తన ప్లేస్‌ను మార్చనుంది. అంటే డిసెంబర్ 29న ధనస్సు రాశిలోకి బుధ గ్రహం ప్రవేశించబోతుంది. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి వచ్చే ఏడాది పట్టిందల్లా బంగారమేనని పండితులు అంటున్నారు. ఏ పని తలపెట్టినా విజయమే లభిస్తుంది. అన్నింట్లో అనుకున్నవి అన్ని జరుగుతాయి. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారని పండితులు అంటున్నారు. మరి ఈ బుధ గ్రహ సంచారం వల్ల ఏయే రాశులకు 2026లో అదృష్టం పట్టబోతుందో తెలుసుకుందాం.

Also Read :  మద్యం సేవించే వారికి బిగ్ షాక్.. సర్వేలో క్యాన్సర్ షాకింగ్ విషయాలు

ధనుస్సు రాశి

బుధుడు ఈ రాశిలోనే ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ సమయం ఎంతో కీలకం. జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు వస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల మద్దతు లభిస్తుంది. మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు, పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు రావచ్చు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పాత అప్పులు తీర్చివేస్తారు. మీరు చేసే తెలివైన పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు తొలగిపోతాయి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి గొడవలు లేకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మేష రాశి

మేష రాశి వారికి ఈ బుధ సంచారం భాగ్య స్థానంలో జరుగుతుంది. దీనివల్ల వీరికి అదృష్టం రెట్టింపు అవుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది బంగారు సమయం. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి. ముఖ్యంగా విదేశీ వాణిజ్యం లేదా ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు చేసే వారికి లాభాలు వెల్లువెత్తుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మీ మాట తీరు మెరుగుపడటం వల్ల ఇతరులను సులభంగా ఆకర్షించగలరు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో చేసే ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు. అన్ని విధాలుగా మంచిగా ఉంటారని పండితులు అంటున్నారు.

కుంభ రాశి

కుంభ రాశి వారికి బుధుడు లాభ స్థానంలో సంచరించబోతున్నాడు. దీనివల్ల వీరికి ఊహించని ధన లాభం కలుగుతుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి ఇప్పుడు లాభాలు వస్తాయి. లాటరీ లేదా పిత్రార్జిత ఆస్తి ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంది. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. స్నేహితులు, బంధువుల నుంచి మీకు పూర్తి సహకారం అందుతుంది. మీ మేధో సామర్థ్యం వల్ల క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకుంటారు.

Also Read :  డ్రెస్ కోడ్ వెనుక సీక్రెట్ ఇదే.. కోకాకోలా యాడ్‌తో తాత ఫేమస్

Advertisment
తాజా కథనాలు