/rtv/media/media_files/2025/12/28/cigarette-2025-12-28-20-48-17.jpg)
కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో పార్లమెంట్(parlement) లో ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు -2025(Central Excise (Amendment) Bill) ఆమోదం పొందింది. ఈ బిల్లు చట్టంగా మారితే దేశంలో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. సామాన్యుల నుంచి నిపుణుల వరకు ఇప్పుడు ఈ ధరల పెంపుపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Also Read : 2025 రిమైండర్: ప్రపంచంలో ఈ ఏడాది జరిగిన కీలక పరిణామాలివే!
సిగరెట్ల ధరలకు రెక్కలు..
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టిన ఈ కొత్త సవరణల ప్రకారం, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను భారీగా పెంచారు(Cigarette Prices Hike). ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యంగా సిగరెట్ ప్రియులకు కోలుకోలేని దెబ్బ కానుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ధరలకు, రాబోయే ధరలకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది.
సిగరెట్లు: ప్రస్తుతం మార్కెట్‌లో సగటున రూ.18కి లభించే ఒక సిగరెట్ ధర, పన్నుల పెంపు తర్వాత ఏకంగా రూ.72 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రతి వెయ్యి సిగరెట్లకు వాటి పొడవును బట్టి రూ.200 నుండి రూ.735 వరకు ఉన్న పన్నును, ఇకపై రూ.2,700 నుండి రూ.11,000 వరకు పెంచాలని ప్రతిపాదించారు. చ్యూయింగ్ టొబాకో (ఖైనీ/గుట్కా)పై పన్ను 25% నుండి 100%కి పెరగనుంది. హుక్కా పొగాకుపై పన్ను 25% నుండి 40%కి పెరుగుతుంది. స్మోకింగ్ మిశ్రమాలపై ఏకంగా 60% నుండి 300% వరకు పన్ను భారం పడనుంది.
Also Read : పాకిస్థాన్‌కు ఇక చుక్కలే.. మరో దాడికి సిద్ధమవుతున్న భారత్
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
ఈ నిర్ణయంపై సోషల్ మీడియా(Social Media) వేదికగా నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ధరలు ఇంత భారీగా పెరగడం వల్ల సామాన్యులు, ముఖ్యంగా యువత ఈ అలవాటుకు దూరమవుతారని, ఇది ప్రజారోగ్యానికి మేలు చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. వ్యసనపరులు ఎంత ధర పెరిగినా మానుకోరని, దీనివల్ల కేవలం సామాన్య మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటాయని మరికొందరు వాదిస్తున్నారు. అంతేకాకుండా, నకిలీ, అక్రమ పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ లక్ష్యం
భారతదేశంలో పొగాకు వినియోగం వల్ల ఏటా లక్షలాది మంది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో, పొగాకు ఉత్పత్తులను సామాన్యులకు అందుబాటులో లేకుండా చేయడం ద్వారా వాటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే, పొగాకు కంపెనీల లాభాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లుతో ఆరోగ్య పరంగా దేశానికి మేలు జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. అయితే, ఆర్థికంగా మాత్రం పొగాకు వినియోగదారులపై ఇది పెను భారంగా మారనుంది.
Follow Us