Fridge Water: ఫ్రిజ్ వాటర్‌ తాగుతున్నారా.. ఒక్క క్షణం ఆలోచించండి

వేడిలో చల్లటి నీరు తాగితే ఉపశమనం కలిగించేలా అనిపిస్తుంది. వేసవిలో ఫ్రిజ్ నుంచి తీసిన చల్లటి నీరు తాగితే అనేక ఆనారోగ్య సమస్యలు వస్తాయి. ఫ్రిజ్‌లో నీరు తాగితే జీవక్రియను మందగించటంతోపాటు జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయదు. పోషకాలు గ్రహించడంలో ఆటంకం కలుగుతుంది.

New Update
Fridge Water

Fridge Water

Fridge Water: వేసవి తీవ్రంగా ఉండటంతో ప్రజలు అధిక ఉష్ణోగ్రతల వల్ల బాధపడుతున్నారు. ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల మధ్య ఉండటంతో వేడి గాలులు ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే అవకాశాలు పెరిగాయి. ఇలాంటి వేడిలో చల్లటి నీరు తాగడం సహజంగా అందరికి ఉపశమనం కలిగించేలా అనిపించవచ్చు. అయితే ఫ్రిజ్ నుండి తీసిన చల్లటి నీరు తాగడం అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. మన శరీరం సహజ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. చల్లటి నీరు తాగినప్పుడు శరీరం తిరిగి అదే ఉష్ణోగ్రతను సాధించడానికి అధిక శక్తిని వినియోగించాలి.

ఇది కూడా చదవండి: డయాబెటిస్ రోగులు చెరకు రసం తాగవచ్చా?

కండరాల తిమ్మిరి:

ఇది జీవక్రియను మందగించేందుకు దారితీస్తుంది, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయదు, పోషకాలు గ్రహించడంలో ఆటంకం కలుగుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తనాళాలు సంకోచించటం ద్వారా గుండె పని మీద ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి ఇది ప్రమాదకరం. అలాగే శరీరంలో వేడి, చల్లదన మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు బరువు తగ్గే ప్రక్రియ మందగిస్తుంది. ఇది శరీరంలోని వాపు సమస్యను కూడా పెంచుతుంది. వ్యాయామం చేసిన వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కండరాల తిమ్మిరి, నొప్పి, రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది. అలానే ఎండలో ఎక్కువసేపు గడిపిన తర్వాత తక్షణంగా చల్లటి నీరు తాగడం వల్ల శరీరానికి షాక్ తగిలే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: వరంగల్‌లో దారుణం.. మూడేళ్ల పాపను ఆ నీచుడు ఏం చేశాడంటే..?

ఇది జలుబు, జ్వరం లేదా బలహీనతకు కారణమవుతుంది. గోరు వెచ్చని లేదా గదిలో ఉంచిన నీరు తాగడం ద్వారా శరీరం సజావుగా పని చేస్తుంది. వేసవిలో 20-25 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉండే నీరు శరీరానికి మంచిదిగా పరిగణించబడుతుంది. ఇది హైడ్రేషన్‌కు, శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు కూడా సహాయపడుతుంది. అందువల్ల వేడి కాలంలో తక్షణ ఉపశమనం కోసం చల్లటి నీరు తాగడం కాకుండా, ఆరోగ్యానికి అనుకూలమైన ఉష్ణోగ్రతలో నీటిని తీసుకోవడం ఉత్తమం.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అధిక బీపీ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందా..?

ఇది కూడా చదవండి: వేసవిలో తరచుగా కడుపునొప్పి వస్తుందా?. ఇది తెలుసుకోండి


( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు